యాప్నగరం

నన్నేందుకు తీసుకున్నావో ఆ దేవుడికే తెలియాలి.. గుడ్ బై చెప్పడం కష్టంగా ఉంది: రష్మిక మందన్న

రష్మిక మందన్న హిందీలో 'గుడ్ బై' మూవీ షూటింగ్‌ను కంప్లీట్ చేసింది. ఈ సినిమా షూట్ పూర్తయిన సందర్భంగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఆసక్తికరంగా పోస్ట్ పెట్టింది. తనకు గుడ్ బై చెప్పడం ఇష్టం లేదంటూ రాసుకోచ్చింది.

Authored byAshok Krindinti | Samayam Telugu 25 Jun 2022, 6:38 pm

ప్రధానాంశాలు:

  • రష్మిక 'గుడ్ బై' సినిమా షూటింగ్ పూర్తి
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్
  • అమితాబ్ బచ్చన్‌తో సినిమా చేయడం అదృష్టం
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu రష్మిక మందన్న
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఫుల్ జోష్‌లో ఉంది. పుష్ప మూవీ హిట్‌తో ఈ కన్నడ బ్యూటీకి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ప్రస్తుతం తెలుగు, తమిళంతో పాటు ఈ ముద్దుగుమ్మ హిందీలోనూ దుమ్ములేపుతోంది. ఇప్పటికే 'మిషన్ మజ్ను' సినిమాను కంప్లీట్ అవ్వగా.. త్వరలోనే ఆడియన్స్ ముందుకు రానుంది. రెండో ప్రాజెక్ట్‌గా 'గుడ్ బై' సినిమాలో రష్మిక నటించింది. తాజాగా ఈ సినిమా పూర్తవ్వగా.. మూవీ యూనిట్‌కు కృతజ్ఞతలు చెబుతూ సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేసింది.
'గుడ్ బై' సినిమాకు గుడ్ బై చెప్పడం తనకిష్టం లేదంటూ ఈ ముద్దుగుమ్మ రాసుకొచ్చింది. గుడ్ బై మూవీ షూటింగ్ పూర్తయిందని తెలిపింది. రెండేళ్లుగా కోవిడ్‌తో పాటు ఏదీ కూడా తమను పార్టీ చేసుకోకుండా అడ్డుకోలేకపోయిందంటూ ఆనందం వ్యక్తం చేసింది. గుడ్ బై సినిమా చాలా ఫన్‌గా ఉంటుందని.. ఈ మూవీ కోసం తాను చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పింది. ప్రపంచంలోనే అమితాబ్ బచ్చన్‌తో సినిమా చేసే అవకాశం రావడం తనకు గర్వంగా ఉందని చెప్పొకొచ్చింది ఈ బ్యూటీ.

తనకు ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ వికాస్ బహల్‌కు కృతజ్ఞతలు చెప్పింది రష్మిక. తనను ఎందుకు గుడ్ బై సినిమాలో తీసుకున్నారో దేవుడికే తెలియాలని పేర్కొంది. ఆయన గర్వించేలా తాను నటించానని అనుకుంటున్నానని గుడ్ బై సినిమా షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి రాసుకొచ్చింది ఈ అందగత్తె. సినిమా చూసేందుకు అందరూ రెడీగా ఉండాలని.. తాను వేచి ఉండలేకపోతున్నానంటూ పోస్ట్ చేసింది.
View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా నటించిన ‘సీతా రామం’ సినిమాలో రష్మిక కీలక పాత్ర పోషించింది. ఆఫ్రిన్ అనే అమ్మాయి పాత్రలో ఈ బ్యూటీ అలరించనుంది. ఆగస్టు 5న ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రానుంది. త్వరలో అల్లు అర్జున్ సరసన పుష్ప-2 మూవీ షూటింగ్‌లో రష్మిక పాల్గొనబోతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.