యాప్నగరం

కరోనా నా ఆనందాన్ని ఆవిరి చేసింది: ‘పెళ్లి చూపులు’ హీరోయిన్

2020లో ప్రథమార్థంలో ‘కనులు కనులను దోచాయంటే’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న తనను కరోనా వైరస్ నిరాశపరిచిందని హీరోయిన్ రీతూ వర్మ తెలిపారు.

Samayam Telugu 14 Dec 2020, 8:12 am
‘బాద్‌షా’ సినిమాలో కాజల్ చెల్లెలిగా నటించి ఆ తర్వాత ‘పెళ్లి చూపులు’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది తెలుగమ్మాయి రీతూ వర్మ. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లోనూ నటిస్తూ దూసుకుపోతోంది. ఈ ఏడాది ఆరంభంలో దుల్కర్‌ సల్మాన్‌తో చేసిన ‘కనులు కనులు దోచాయంటే’ సినిమాతో ఘనవిజయం అందుకున్న రీతూ.. ప్రస్తుతం విక్రమ్‌తో తమిళ చిత్రం ‘ధృవ నచ్చత్తిరమ్‌’, నానితో ‘టక్‌ జగదీష్‌’ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాల్లో నటిస్తూ బిజీగా మారింది. అయితే ఈ ఏడాది కోవిడ్ కారణంగా తాను చాలా నష్టపోయానని చెబుతోంది ఈ హీరోయిన్.
Samayam Telugu రీతూ వర్మ


Also Read: 90 సినిమాలకు కథా రచయిత, చిరంజీవి కెరీర్‌లో కీలక పాత్ర.. డీఎస్పీ తండ్రి సత్యమూర్తి

‘ఈ ఏడాది తొలి రెండు నెలలు షూటింగ్‌లతో బిజీ బిజీగా గడిచిపోయింది. ఆ వెంటనే దుల్కర్‌తో చేసిన సినిమా సూపర్ హిట్ కావడంతో నా ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. దీంతో 2020 సంవత్సరం నాకు మరుపురానిదిగా మిగిలిపోతుందని, ఏడాది చివరి రోజు వరకు ఈ ఆనందం కొనసాగుతుందని చాలా ఆశలు పెట్టుకున్నాను. అప్పుడు నా చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అవన్నీ ఈ ఏడాది విడుదల కావాల్సినవే. అయితే కరోనా దెబ్బకు ఆ సినిమాల షూటింగులన్నీ వాయిదా పడ్డాయి. దీంతో ఈ ఏడాది నాకు తీవ్ర నిరాశ మిగిల్చింది’ అని చెప్పుకొచ్చింది రీతూ వర్మ.

Also Read: హైదరాబాద్‌లో రజినీకాంత్... ‘అన్నత్తే’ షూటింగ్ షురూ

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.