యాప్నగరం

శ్రియా శరణ్ .. 18 ఏళ్లు ఇండస్ట్రీ ఇక్కడ!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌గా ఉంటూనే కుర్రహీరోలతోనూ ఆడిపాడిన శ్రియా శరణ్ 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో తళుక్కున మెరుస్తూనే ఉంది.

TNN 11 Sep 2017, 7:16 pm
టాలీవుడ్ సీనియర్ హీరోయిన్‌గా ఉంటూనే కుర్రహీరోలతోనూ ఆడిపాడిన శ్రియా శరణ్ 18 ఏళ్లుగా ఇండస్ట్రీలో తళుక్కున మెరుస్తూనే ఉంది. ఇటీవల ‘పైసా వసూల్’ చిత్రంలో అందాలతో కనివిందు చేసిన ఈ సీనియర్ బ్యూటీ 35 వ ఏట అడుగుపెట్టినా వన్నెతరగని వయ్యారాలను వలకబోస్తూనే ఉంది. ఇవాల్టితో ఈ నాజూకు నడుము అందగత్తెకు 35 ఏళ్లు నిండనున్నాయి. ఈ సందర్భంగా ఈ బ్యూటీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వీరభోగ వసంత రాయలు’ చిత్రంలో శ్రియా లుక్‌ని రిలీజ్ చేసి బర్త్ డే గిఫ్ట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
Samayam Telugu actress shriya saran birthday wishes by veera bhoga vasantha rayalu team
శ్రియా శరణ్ .. 18 ఏళ్లు ఇండస్ట్రీ ఇక్కడ!


నారా రోహిత్, శ్రీ విష్ణు హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రియా శరణ్ ఎయిర్ హోస్టెస్‌గా సందడి చేయనుంది. ‘వీర భోగ వసంత రాయలు’ చిత్ర కథ మొత్తం ఈ పాత్ర చుట్టూనే తిరుగుంతుందని ఇందులో శ్రియ క్యారెక్టర్ చాలా కీలకం అంటున్నారు మేకర్స్. గౌతమి పుత్ర శాతకర్ణి సినిమాతో తిరిగి ఫామ్‌లోకి వచ్చిన శ్రియా.. మళ్లీ బాలయ్య సరసన ‘పైసా వసూల్’ చిత్రంలో నటించి తనలో గ్లామర్ లుక్ స్టిల్ కంటిన్యూ అని నిరూపించేసింది. అయితే ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లు పూర్తైనా అవకాశాలు ఈ అమ్మడును వెతుక్కుంటూ వెళ్లడం విశేషమనే చెప్పాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.