యాప్నగరం

శ్రియా పెళ్లైపోయిందోచ్...!

శ్రియా పెళ్లిపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. రష్యా ప్లేయర్ అండ్రీను ఆమెను పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరిగింది. తర్వాత అది నిజం కాదని శ్రియా తల్లి ఖండిచారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆమె పెళ్లైపోయిందనే టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Samayam Telugu 17 Mar 2018, 2:32 pm
శ్రియా పెళ్లిపై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. రష్యా ప్లేయర్ అండ్రీను ఆమెను పెళ్లి చేసుకోబోతోందని ప్రచారం జరిగింది. తర్వాత అది నిజం కాదని శ్రియా తల్లి ఖండిచారు. అయితే ఇప్పుడు ఏకంగా ఆమె పెళ్లైపోయిందనే టాక్ నడుస్తోంది. సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. కొంతమంది బంధువులు, స్నేహితులు, ప్రముఖుల సమక్షంలో మార్చి 12న ముంబైలో శ్రియా అండ్రీ వివాహం జరిగిందని తెలుస్తోంది. 11న ప్రీ వెడ్డింగ్ వేడుక కూడా జరుపుకున్నారట. ఇండస్ట్రీ నుంచి మనోజ్ బాజ్‌పేయి, షబానా అజ్మీలు మాత్రమే వెళ్లారట.
Samayam Telugu actress shriya saran marries russian boyfriend andrei koscheev
శ్రియా పెళ్లైపోయిందోచ్...!


అంతేకాదు పెళ్లి కూడా హిందూ సంప్రదాయంలో జరిగినట్లు సమాచారం. శ్రియా గులాబి రంగు చీరలో పెళ్లి కుమార్తెగా మెరిశారని తెలుస్తోంది. శ్రియా, ఆండ్రీ చాలా ఏళ్లుగా ప్రేమలో ఉన్నారు. కానీ ఈ విషయం గురించి ఆమె ఎప్పుడూ మాట్లాడలేదు. గతంలో పెళ్లి వార్తలు వచ్చినా వాటిని ఖండించారు. ఇప్పుడు ఏకంగాపెళ్లే చేసుకున్నారంటూ ప్రచారం మొలయ్యింది. అయితే శ్రియా తరపు నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.