యాప్నగరం

పోలీసులకు అందని దూరంలో ‘చందమామ’

‘చందమామ’ చిన్నది సింధు మీనన్ అరెస్టు చేయడం కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇంతకీ ఏం జరిగింది?

Samayam Telugu 11 Mar 2018, 5:31 pm
కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందించిన ‘చందమామ’ సినిమాతో పాపులరైన హీరోయిన్ సింధు మీనన్‌పై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. సింధు మీనన్ సోదరుడు మనోజ్ కార్తికేయన్ బెంగళూరులోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రూ.30 లక్షలు రుణం తీసుకున్నాడు. ఇందుకు సింధు మూడో గ్యారంటర్‌గా ఉంది. అయితే, చాలా రోజుల నుంచి రుణం చెల్లించకపోగా, నకిలీ డాక్యుమెంట్లు ఇచ్చి మోసం చేశారని బ్యాంకు అధికారులు ఆమెపైనా, ఆమె సోదరులపైనా బెంగళూరులోని ఆర్‌ఎంసీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
Samayam Telugu actress sindhu menon booked for loan default
పోలీసులకు అందని దూరంలో ‘చందమామ’


ఈ మేరకు పోలీసులు సింధు సోదరుడు కార్తికేయన్‌ను అరెస్టు చేశారు. ఈ కేసుపై సింధు మీనన్ కూడా అరెస్టు చేయడానికి ప్రయత్నించారు. ఆమె విదేశాల్లో ఉన్న నేపథ్యంలో సాధ్యం కాలేదు. చందమామ తర్వాత మరికొన్ని తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన సింధు.. ఓ ఐటీ ఉద్యోగిని వివాహం చేసుకుని లండన్‌లో స్థిరపడింది. ఈ నేపథ్యంలో ఆమెను ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.