యాప్నగరం

మళ్లీ రోడ్డెక్కిన శ్రీరెడ్డి..కాస్టింగ్ కౌచ్‌పై కాదులెండి

అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పోరాటానికి సిద్ధమంటోంది శ్రీరెడ్డి. మొన్న కాస్టింగ్ కౌచ్‌పై... నిన్న జూనియర్ ఆర్టిస్టుల సమస్యలు... ఇప్పుడు సాధారణ మహిళలు... ఇలా ఆడవాళ్లకు ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేనున్నాంటూ అండగా నిలబడుతోంది.

Samayam Telugu 18 May 2018, 6:05 pm
అన్యాయం ఎక్కడ జరిగితే అక్కడ పోరాటానికి సిద్ధమంటోంది శ్రీరెడ్డి. మొన్న కాస్టింగ్ కౌచ్‌పై... నిన్న జూనియర్ ఆర్టిస్టుల సమస్యలు... ఇప్పుడు సాధారణ మహిళలు... ఇలా ఆడవాళ్లకు ఎక్కడ సమస్యలుంటే అక్కడ నేనున్నాంటూ అండగా నిలబడుతోంది. ఈ విషయాలన్నీ ఇప్పుడెందుకుని అనుకుంటున్నారా. ఏం లేదు మహిళల సమస్యలపై శ్రీరెడ్డి మళ్లీ రోడ్డెక్కారు... కాస్టింగ్ కౌచ్ గురించి కాదులెండి... ఉపాధి హామీ కూలీలైన మహిళల కోసం. అదేంటి ఉపాధి హామీ కూలీలకు ఆమెకు సంబంధమేంటని షాకవుతున్నారా. అక్కడే ఉంది చిన్న ట్విస్ట్.
Samayam Telugu Sri Reddy


శ్రీరెడ్డి మల్లిఖార్జున స్వామివారిని దర్శించుకునేందుకు శ్రీశైలం వెళ్లారు. అయితే మార్గ మధ్యలో ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం గురిజేపల్లి దగ్గరకు వచ్చారు. అదే సమయంలో తమకు ఉపాధి హామీ పనులు కల్పించడం లేదని ఆరోపిస్తూ... స్థానిక మహిళలు నిరసన తెలుపుతూ రోడ్డుపై బైఠాయించారు. ఈ ఆందోళనను గమనించిన శ్రీరెడ్డి... కారు దిగి వచ్చారు... వాళ్ల సమస్య ఏంటో అడిగి తెలుసుకున్నారు. వెంటనే వారికి మద్దతుగా తలకు పాగా చుట్టుకొని రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు.

శ్రీరెడ్డి కూడా మహిళలతో నిరసన చేయడంతో... స్థానికులు చాలామంది ఆమెను ఆశ్చర్యపోయారు. కాసేపు మహిళలతో ఆందోళనను కొనసాగించిన ఆమె... వారి సమస్యల్ని అడిగి తెలుసుకొని అక్కడి నుంచి శ్రీరెడ్డి వెళ్లిపోయారు. అయితే సినిమా నటి వచ్చిందని స్థానికంగా తెలియడంతో జనాలంతా రోడ్డుపైనే గుమ్మి గూడారు. దీంతో అక్కడ హడావిడి వాతవరణం కనిపించగా... ఈ ఆందోళనతో శ్రీరెడ్డి మళ్లీ వార్తల్లో నిలిచింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.