యాప్నగరం

బాయ్ ఫ్రెండ్స్ అంటే సినిమాల్లాంటివాళ్లు

బాయ్ ఫ్రెండ్స్ అంటే సినిమాల్లాంటి వాళ్లు.. కొన్ని టైమ్‌పాస్... ఇంకొన్ని బ్లాక్‌బస్టర్స్ అన్నట్టుంటుంది.ఇది ఎవరో కొట్టిన డైలాగ్ కాదు...

TNN 17 Oct 2016, 7:33 pm
బాయ్ ఫ్రెండ్స్ అంటే సినిమాల్లాంటి వాళ్లు.. కొన్ని టైమ్‌పాస్... ఇంకొన్ని బ్లాక్‌బస్టర్స్ అన్నట్టుంటుంది. ఇది ఎవరో కొట్టిన డైలాగ్ కాదు... ఈ అక్టోబర్ 28న రిలీజ్ కానున్న వివాదాస్పద చిత్రం 'యే దిల్ హై ముష్కిల్'లో రణ్‌బీర్ కపూర్‌తో అనుష్కా శర్మ కొట్టిన డైలాగ్. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా ట్రైలర్ సినీప్రియుల్లో సంచలనం సృష్టిస్తోంది. ముఖ్యంగా అనుష్కా శర్మ, ఐశ్వర్యా రాయ్ బచ్చన్‌లతో రణ్‌బీర్ కపూర్ రొమాంటిక్ కెమిస్ట్రీ ఆడియెన్స్‌లో హాట్ టాపిక్ అయ్యింది. దీనికితోడు తాజాగా ఇవాళ రిలీజైన ఈ 'బాయ్‌ఫ్రెండ్స్ సినిమాల్లాంటివాళ్లు' అనే డైలాగ్ మరోసారి సినిమాపై ఆసక్తిని పెంచేసింది. తనకి 2 ఏళ్ల వయసున్నప్పుడు తన తల్లి తనని విడిచి వెళ్లిపోయిందని రణ్‌బీర్ కపూర్ ఆవేదనతో చెబితే... ఆ సందర్భాన్ని సైతం ఫన్నీగా తీసుకుని అతడితో జోకులేసేందుకు ట్రై చేస్తున్న అనుష్కని చూస్తోంటే ఆ ఇద్దరి పాత్రల తీరుతెన్నులు ఎలా వుండబోతున్నాయనే విషయం కూడా కొంతవరకు స్పష్టమవుతోంది. 32 సెకన్ల నిడివిగల ఈ ప్రోమోపై మీరూ ఓ లుక్కేయండి!
Samayam Telugu ae dil hai mushkil boyfriend filmo ki tarah dialogue promo
బాయ్ ఫ్రెండ్స్ అంటే సినిమాల్లాంటివాళ్లు


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.