యాప్నగరం

శ్రీదేవికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న అజీత్!

నటతోనే కాదు, మంచి వ్యక్తిత్వంతోనూ తమిళ ప్రజల మనసు గెలుచుకుంటున్న నటుడు అజీత్ కుమార్. సింప్లిసిటీకి మారుపేరైన అజీత్ కుమార్‌కు మన అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అంటే చాలా ఇష్టం.

Samayam Telugu 17 Aug 2018, 2:15 pm
టతోనే కాదు, మంచి వ్యక్తిత్వంతోనూ తమిళ ప్రజల మనసు గెలుచుకుంటున్న నటుడు అజీత్ కుమార్. సింప్లిసిటీకి మారుపేరైన అజీత్ కుమార్‌కు మన అతిలోక సుందరి, దివంగత నటి శ్రీదేవి అంటే చాలా ఇష్టం. అందుకే, 2011లో శ్రీదేవి రీ ఎంట్రీ ఇచ్చిన ‘ఇంగ్లీష్ వింగ్లీష్’ చిత్రంలో నిర్మాతలను అడిగిమరీ అతిథి పాత్రలో అజీత్ నటించారు.
Samayam Telugu Untitled123


ఈ సందర్భంగా ఆయన హీరోగా తమిళంలో సినిమా నిర్మించాలని ఉందని శ్రీదేవి అజీత్‌తో అన్నారు. తప్పకుండా చేస్తానని అజీత్ ఆమెకు మాట ఇచ్చారు. ఈ విషయాన్ని బోనీకి కూడా చెప్పారు. ఆ తర్వాత మళ్లీ ఆ ప్రస్తావన రాలేదు. శ్రీదేవి మరణం తర్వాత అజీత్ ఈ విషయాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ నేపథ్యంలో 2019లో బోనీ కపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రంలో నటించేందుకు అజీత్ డేట్లు ఇచ్చినట్లు తెలిసింది. ఈ చిత్రానికి ‘ఖాకీ’ చిత్ర దర్శకుడు హెచ్.వినోద్ దర్శకత్వం వహించనున్నట్లు సమాచారం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.