యాప్నగరం

నాగార్జున కోరిక తీరేనా..?

సమంతా, చైతుల ప్రేమ వ్యవహారాన్ని కూడా దాచిపెట్టకుండా.. మంచి సంధర్భం చూసి పబ్లిక్‌గా చెప్పేశారు.

TNN 27 Feb 2017, 7:58 pm
ఇండస్ట్రీలో నాగార్జునకు ఉన్న క్రేజే వేరు. యంగ్ హీరోలతో పోటీ పడి మరీ నటించే నాగార్జునకు తన సినిమాలకు సంబంధించి గానీ.. వ్యక్తిగత విషయాలకు సంబంధించి గానీ ఏవైనా విషయాలు బయటకు వస్తే వెంటనే మీడియాను పిలిచి క్లారిటీ ఇవ్వడం మొదటి నుంచీ ఉన్న అలవాటు. ఇటీవల దిల్ రాజు బ్యానర్‌లో నాగ్ సినిమా చేస్తున్నారనే వార్త బయటకు రాగానే వెంటనే ఖండించారు. సమంతా, చైతుల ప్రేమ వ్యవహారాన్ని కూడా దాచిపెట్టకుండా.. మంచి సంధర్భం చూసి పబ్లిక్‌గా చెప్పేశారు.
Samayam Telugu akhil akkineni and shriya bhupal get engaged
నాగార్జున కోరిక తీరేనా..?


కానీ అఖిల్, శ్రేయాభూపాల్ పెళ్లి వ్యవహారం గురించి మాత్రం ఆయన నోరు మెదపడంలేదు. ఈ విషయంపై ఏమీ మాట్లాడొద్దని కుటుంబ సభ్యులకు కూడా సూచించారట. దీనికి కారణం చివరి క్షణాల్లోనైనా.. ఈ పెళ్లి ఓకే అవుతుందని నాగ్ నమ్మడమేనట. అఖిల్ పెళ్లికి బ్రేక్ పడిందనే న్యూస్ తెలిసినప్పటి నుంచీ రకరకాల కథనాలు ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. కానీ ఈ విషయమై అటు నాగ్ ఫ్యామిలీ గానీ.. జీవీకే ఫ్యామిలీ గానీ క్లారిటీ ఇవ్వలేదు. ఎప్పటికైనా అఖిల్, శ్రియ తమ మధ్య మనస్పర్థలను తొలగించుకొని మళ్లీ కలిసిపోతారని నాగార్జున నమ్ముతున్నారట. వారిద్దరూ కలిసే క్షణం కోసం ఎదురుచూస్తున్నారట. నాగార్జున కోరిక తీరుతుందో.. లేదో.. వేచి చూడాలి మరి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.