యాప్నగరం

టీజర్: ‘హలో’ అంటూ లైఫ్‌ని షేర్ చేసిన అఖిల్..

అఖిల్‌ అక్కినేని ‘హలో..’ అంటూ వచ్చేశాడు.. అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమా టీజర్‌ను గురువారం (నవంబర్ 16) విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ ఈ టీజర్‌కు మరో ఆకర్షణగా నిలిచింది.

TNN 16 Nov 2017, 8:10 pm
అఖిల్‌ అక్కినేని ‘హలో..’ అంటూ వచ్చేశాడు.. అఖిల్ హీరోగా నటిస్తున్న హలో సినిమా టీజర్‌ను గురువారం (నవంబర్ 16) విడుదల చేశారు. నాగార్జున వాయిస్‌ ఈ టీజర్‌కు మరో ఆకర్షణగా నిలిచింది. ‘ద లక్కీయెస్ట్‌ పీపుల్‌ బోర్న్‌ ఆన్‌ ఇన్‌ దిస్‌ ఎర్త్‌. వాళ్లు మాత్రం ఎవరేం చేసినా.. ఏం అడ్డు వచ్చినా.. తన సోల్‌ మేట్‌ని కలుస్తారు. లైఫ్‌ని షేర్‌ చేసుకుంటారు’ అనే వాయిస్‌ ఓవర్‌తో టీజ‌ర్‌ ప్రారంభమైంది. ‘మనం’ ఫేమ్ విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మరోసారి యాక్షన్‌ సన్నివేశాలకు పెద్దపీట వేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.
Samayam Telugu akhil akkinenis hello movie teaser
టీజర్: ‘హలో’ అంటూ లైఫ్‌ని షేర్ చేసిన అఖిల్..


అఖిల్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న కల్యాణి తన లుక్స్‌తో అదరగొట్టింది. రమ్యకృష్ణ, జగపతిబాబు కీలక పాత్రల్లో కనిపించారు. అన్నపూర్ణా స్టూడియోస్‌, మనం ఎంటర్‌ప్రైజెస్‌ పతాకంపై అక్కినేని నాగార్జున ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అనూప్‌ రూబెన్స్‌ సంగీతం సమకూరుస్తున్న ఈ సినిమా డిసెంబర్‌ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.