యాప్నగరం

అఖిల్ కోసం కొత్త హీరోయిన్ రెడీ

చాలా గ్యాప్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన అఖిల్ అక్కినేని రెండో సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ వెతుకులాటలో పడింది ఆ మూవీ...

TNN 26 May 2017, 1:39 pm
చాలా గ్యాప్ తర్వాత సెట్స్‌పైకి వెళ్లిన అఖిల్ అక్కినేని రెండో సినిమా కోసం ఓ కొత్త హీరోయిన్ వెతుకులాటలో పడింది ఆ మూవీ యూనిట్. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను నాగార్జున తన సొంత ప్రొడక్షన్స్‌లో నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో తొలి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా యూనిట్ త్వరలోనే నార్త్ ఇండియాకు ప్రయాణం కానుంది. ఇటీవల మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ సినిమాకు సంబంధించిన విశేషాలని పంచుకున్న నాగ్.. అఖిల్ సరసన ఓ కొత్త హీరోయిన్‌ని పరిచయం చేయనున్నట్టు తెలిపారు.
Samayam Telugu akhil akkinenis next to have new comer as heroine
అఖిల్ కోసం కొత్త హీరోయిన్ రెడీ


ప్రస్తుతానికి నాలుగైదు ఆప్షన్స్ అయితే రెడీగా వున్నాయి కానీ ఇంకా ఏదీ పైనలైజ్ కాలేదని స్పష్టంచేశారు నాగ్. ఎవరో ఒకరిని ఫైనల్ చేయడం తప్ప ఇక మిగతాదంతా రెడీ అని అన్నారు కానీ ఆ నాలుగైదు ఆప్షన్స్‌లో ఎవరి పేర్లు వున్నాయనే వివరాల్ని మాత్రం నాగ్ వెల్లడించలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.