యాప్నగరం

అఖిల్ హీరోయిన్ కు తెలుగులో మరోసారి !

'అఖిల్' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయిన నటి సయేషా సైగల్. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. సయేషా నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. తన క్యూట్ లుక్స్, అందంతో యూత్ ను బాగానే ఆకట్టుకుంది...

TNN 25 Jul 2016, 2:37 pm
అక్కినేని నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ ను హీరోగా లాంఛ్ చేస్తూ 'అఖిల్' సినిమా తెరకెక్కింది. ఈ సినిమాలో అఖిల్ సరసన హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమయిన నటి సయేషా సైగల్. సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చినా.. సినిమాలో సయేషా నటనకు మాత్రం పాజిటివ్ టాక్ వచ్చింది. తన క్యూట్ లుక్స్, అందంతో యూత్ ను బాగానే ఆకట్టుకుంది. 'అఖిల్' సినిమాను ఎంతో గ్రాండ్ గా తెరకెక్కించినా ఈ సినిమా మాత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అయితే సయేషా నటించిన మొదటి సినిమానే ఫ్లాప్ అయినప్పటికీ తెలుగులో ఈ అమ్మడుకి అవకాశాలు ఏమాత్రం తగ్గడం లేదు. రాజ్ తరుణ్ హీరోగా అనిల్ సుంకర రెండు చిత్రాలను నిర్మిస్తున్నారు. అందులో ఒక చిత్రంలో హీరోయిన్ గా నటించమని సయేషాను సంప్రదించినట్లు సమాచారం. కథ నచ్చడంతో తను కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. కాగా, అయేషా ప్రస్తుతం బాలీవుడ్ లో యాక్షన్ హీరో అజయ్ దేవగన్ నటిస్తున్న 'శివాయ్' చిత్రంలో నటిస్తుంది.
Samayam Telugu akhil heroine sayyesha saigal next movie with raj tarun
అఖిల్ హీరోయిన్ కు తెలుగులో మరోసారి !


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.