యాప్నగరం

అఖిల్‌కి కూడా లైన్ క్లియరైంది!

అక్కినేని అఖిల్ తన ప్రేమ గురించి ఇంట్లో చెప్పారని, ఎంగేజ్‌మెంట్ కూడా అయిందనే వార్తలు వినవస్తున్నాయి.

TNN 28 Jun 2016, 7:35 pm
అక్కినేని అఖిల్ తన ప్రేమ వ్యవహారం గురించి ఇంట్లో చెప్పారని, ఎంగేజ్‌మెంట్ కూడా అయిందనే వార్తలు వినవస్తున్నాయి. అయితే తనకు ఎంగేజ్‌మెంట్ జరిగిందనే వార్తలు అవాస్తవమని తేల్చి చెప్పాడీ టాలీవుడ్ యువ హీరో. అమ్మాయిని ఇంట్లో వాళ్లకి పరిచయం చేశానని చెప్పిన అఖిల్ ఆ అమ్మాయి గురించి మీడియాకు అంతగా తెలియదని, మేం ఇద్దరం ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పాడు. ఇంట్లో వాళ్లు ప్రేమకు అంగీకరించారని, అమ్మాయి తరఫు వాళ్ల నుంచి కూడా అభ్యంతరం లేదని అఖిల్ చెప్పాడు. అయితే ఆ అమ్మాయి నగరంలోని ఓ వ్యాపారి కుమార్తె అని సమాచారం. ఆమె పేరు శ్రేయ భూపాల్ అని, ఆమె న్యూయార్క్‌లో చదువుకున్నదని తెలుస్తోంది. ఇప్పటికే నాగ చైతన్య ప్రేమ వ్యవహారం ఓ కొలిక్కి రావడంతో ఇద్దరు అన్నదమ్ములకు త్వరలోనే ఎంగేజ్‌‌‌‌‌మెంట్ జరిగే అవకాశం ఉందట. నాగచైతన్య నటిస్తోన్న ‘ప్రేమమ్’ సినిమా పూర్తవగానే నిశ్చితార్థ వేడుక జరిగే అవకాశం ఉంది. సో.. నాగార్జున ఇంట్లో త్వరలోనే పెళ్లి భాజా మోగనుందన్నమాట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.