యాప్నగరం

అక్కినేని వారి నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక

అక్కినేని వారింట్లో పెద్దోడి కంటే ముందే చిన్నోడు పెళ్లి పీటలెక్కేస్తున్నాడు. అఖిల్- శ్రియాల నిశ్చితార్థ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికను కూడా అచ్చు వేయించారు...

TNN 2 Nov 2016, 11:06 am
అక్కినేని వారింట్లో పెద్దోడి కంటే ముందే చిన్నోడు పెళ్లి పీటలెక్కేస్తున్నాడు. అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య, హీరోయిన్ సమంతతో, అలాగే చిన్న కుమారుడు అఖిల్.. ఫ్యాషన్ డిజైనర్ అయిన శ్రియా భూపాల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించారు. వచ్చే ఏడాది వీరి పెళ్లిళ్లు జరగబోతున్నాయి. అయితే చైతూ- సామ్‌లు ఇద్దరూ సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ముందుగా చిన్నోడు అఖిల్ పెళ్లి జరపటానికి ​ పెద్దలు నిశ్చయించారు. అఖిల్- శ్రియాల నిశ్చితార్థ వేడుకకు సంబంధించి ఆహ్వాన పత్రికను కూడా అచ్చు వేయించారు. రాబోయే డిసెంబర్ 9న సాయంత్రం 7 గంటల నుంచి హైదరాబాదులోని జీవీకే హౌజ్‌లో అఖిల్- శ్రియాల నిశ్చితార్థ వేడుక జరగబోతోంది.
Samayam Telugu akhil shriyas engagement date fixed invitation card printed
అక్కినేని వారి నిశ్చితార్థ ఆహ్వాన పత్రిక




కాగా, వచ్చే సమ్మర్‌లో ఇటలీలో వీరి పెళ్లిని గ్రాండ్‌గా చేయాలని నిశ్చయించారని తెలుస్తుంది. అఖిల్ తన పెళ్లిని డెస్టినేషన్ పద్దతిలో చేసుకోవాలని అందుకు ఇటలీలోని రోమ్ నగరాన్ని ఎంచుకున్నాడట. మొత్తానికి పెద్దకొడుకు కంటే ముందే చిన్న కొడుకుని ఓఇంటివాడిని చేయబోతున్నాడు నాగార్జున.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.