యాప్నగరం

చైతూ-సమంత ఎంగేజ్‌మెంట్ డేట్ తెలిసిపోయింది!

అక్కినేని అభిమానులకు శుభవార్త. నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో తెలిసిపోయింది. డిసెంబర్ 9న అక్కినేని అఖిల్, శ్రేయా భూపాల్ ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే.

TNN 25 Dec 2016, 11:33 am
అక్కినేని అభిమానులకు శుభవార్త. నాగచైతన్య ఎంగేజ్‌మెంట్ ఎప్పుడో తెలిసిపోయింది. డిసెంబర్ 9న అక్కినేని అఖిల్, శ్రేయా భూపాల్ ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచే చైతూ-సమంత నిశ్చితార్థం ఎప్పుడా అని అక్కినినే ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. జనవరి 29న వీరి ఎంగేజ్‌మెంట్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే ఎంగేజ్‌మెంట్ తేదీ ఇదేనని అక్కినేని కుటుంబ సభ్యులు ఇంకా ప్రకటించలేదు. నిశ్చితార్థం ఏ సమయంలో నిర్వహిస్తారు. వేదిక ఎక్కడా అనే వివరాల కోసం అక్కినేని ఫ్యాన్స్‌తోపాటు, సమంత అభిమానులు ఎదురు చూస్తున్నారు. అఖిల్ నిశ్చితార్థ వేడుక తరహాలోనే చైతూ ఎంగేజ్‌మెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించనున్నారు.
Samayam Telugu akkineni nagachaitanya samantha engagement date fixed
చైతూ-సమంత ఎంగేజ్‌మెంట్ డేట్ తెలిసిపోయింది!


సమంత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీలో సభ్యురాలిగా కలిసిపోయిన సంగతి తెలిసిందే. అఖిల్ ఎంగేజ్‌మెంట్‌కు కూడా ఆమె హాజరై సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. అఖిల్ నిశ్చితార్థ వేడుకకు కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. త్వరలో పెళ్లి డేట్ అపీషియల్‌గా ప్రకటించబోతున్నారు. అఖిల్ పెళ్లి ఇటలీ జరగనున్న సంగతి తెలిసిందే. మరి చైతూ-సమంత వివాహం ఎక్కడ జరుగుతుందో?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.