యాప్నగరం

వర్మ సినిమాలో నాగార్జున ఇలా!

రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న నాలుగో సినిమా ఇది.

TNN 8 Jan 2018, 1:35 pm
రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో నాగార్జున హీరోగా నటిస్తున్న నాలుగో సినిమా ఇది. టైటిల్ ఇంకా ఏం అనుకోలేదు. దర్శకుడిగా వర్మ కథ అయిపోయిందన్న సమయంలో.. అనూహ్యంగా ఈ సినిమాకు ఓకే చెప్పాడు నాగ్. ‘శివ’ వంటి తెలుగు ఇండస్ట్రీ గతిని మార్చిన సినిమాను రూపొందించిన కాంబినేషన్ ఇది. దశాబ్దాల తర్వాత తిరిగి జత అయ్యింది ఈ కాంబో.
Samayam Telugu akkineni nagarjuna from the sets of nagrgv4
వర్మ సినిమాలో నాగార్జున ఇలా!


ఇలాంటి నేపథ్యంలో వీళ్లు ఎలాంటి సినిమాను రూపొందిస్తారు? నాగ్ తో సినిమాతో వర్మ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడా? పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెబుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇస్తుంది? అనేవి అనేకమంది మదిలోని ప్రశ్నలు.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆర్జీవీ సినిమా సెట్స్ మీద నుంచి నాగార్జున లుక్ ఒకటి ఇంటర్నెట్ లోకి వచ్చింది. వైరల్ గా మారింది. యమ సీరియస్ లుక్ తో అదరగొట్టాడు నాగార్జున. ఇందులో ఈ హీరోది పోలీసాఫీసర్ వేషం అని సమాచారం. అందుకు తగ్గట్టైన సీరియస్ పోలీసాఫీసర్ గా నాగ్ రఫ్ చూపులతో సినిమాపై నమ్మకాన్ని పెంచుతున్నాడు!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.