యాప్నగరం

అరె.. సమంతకు సగమే ఇచ్చారట!

టాలీవుడ్ లో ఉన్న అగ్ర కథానాయికల్లో సమంత ఒకరు. ఆమెతో కలిసి సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు.

TNN 17 Oct 2017, 7:58 pm
టాలీవుడ్ లో ఉన్న అగ్ర కథానాయికల్లో సమంత ఒకరు. ఆమెతో కలిసి సినిమాలు చేయడానికి నిర్మాతలు ఆసక్తి చూపుతుంటారు. ఆమె ఎంత రెమ్యూనరేషన్ అడిగినా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సమంత ఒక్కో సినిమాకు కోటి పదిహేను లక్షల వరకు పారితోషికం డిమాండ్ చేస్తుంటుంది. ఆమె సినిమాలకు సక్సెస్ రేట్ ఎక్కువగా ఉండడంతో స్టార్ హీరోలు కూడా ఆమెనే ప్రిఫర్ చేస్తుంటారు.
Samayam Telugu akkineni samantha remuneration for raju gari gadhi 2
అరె.. సమంతకు సగమే ఇచ్చారట!


రీసెంట్‌గా ఆమె నటించిన 'రాజు గారి గది2' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విజయం వెనుక సమంత కీలక పాత్ర పోషించింది. అయితే ఈ సినిమాకు ఆమె తన రెమ్యూనరేషన్‌ను సగానికి సగం తగ్గించి తీసుకుందని సమాచారం. కేవలం తన పాత్ర నచ్చడం మాత్రమే దానికి కారణం కాదట. తన మామగారు నాగార్జునతో కలిసి నటించే అవకాశం రావడంతో ఆ ఛాన్స్‌ను మిస్ చేసుకోకూడదని తక్కువ రెమ్యూనరేషన్‌కు అంగీకరించిందని సమాచారం. అయితే ఆ పారితోషికం కూడా సినిమా విడుదలై హిట్ టాక్ వచ్చిన తరువాతే సమంతకు అందించారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.