యాప్నగరం

అక్కినేని vs అక్కినేని: సమంత, నాగ్ ఫైటింగ్

అక్కినేని వారింట కోడలిగా సమంత అడుగుపెట్టి వారమైనా కాలేదు. మామా కోడళ్ల మధ్య అప్పుడే పోరు మొదలైంది.

TNN 12 Oct 2017, 11:02 am
అక్కినేని వారింట కోడలిగా అడుగుపెట్టిన సమంత.. తన మామ నాగార్జునతో కలిసి పోటీకి సై అంటోంది. అర్థం కాలేదా? వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటించిన రాజు గారి గది 2 సినిమా ఈ శుక్రవారం విడుదల అవుతోంది. 127 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా హార్రర్, హ్యూమర్ కలబోతగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. మలయాళ చిత్రం ప్రేతమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాకు ఓంకార్ దర్శకత్వం వహించారు. పీవీపీ సంస్థ ఈ మూవీని నిర్మించింది.
Samayam Telugu akkineni vs akkineni raju gari gadhi 2 realsing friday
అక్కినేని vs అక్కినేని: సమంత, నాగ్ ఫైటింగ్


ఈ మూవీలో సమంత దెయ్యంగా నటించగా, నాగార్జున మెంటలిస్ట్‌గా కనిపిస్తారు. ఈ సినిమా సమంత వర్సెస్ నాగార్జునగా సాగనుంది. దెయ్యంగా పగ తీర్చుకోవాలని భావించే సమంత, దాని అడ్డుకోవడం కోసం ప్రయత్నించే మెంటలిస్ట్‌ పాత్రలో నాగ్.. ఇలా ఒకరితో మరొకరు పోటీ పడనున్నారు. నాగ చైతన్యతో పెళ్లయ్యాక సమంత అక్కినేని కుటుంబ సభ్యురాలైంది. సామ్ వివాహమైన కొద్ది రోజులకే నటించిన ఈ చిత్రం విడుదల అవుతుండటంతో.. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ మూవీలో అమృత అనే లా స్టూడెంట్ పాత్రలోనూ సమంత కనిపించనుంది. ‘రాజుగారి గది’లో హీరోగా నటించిన అశ్విన్‌తో పాటు సీరత్ కపూర్, వెన్నెల కిశోర్, షకలక శంకర్‌లు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

. @iamnagarjuna , @Samanthaprabhu2 and @IamSeeratKapoor 's Horror Thriller #RajuGariGadhi2 releases big tomorrow.. pic.twitter.com/HXjnSKjnGl — Ramesh Bala (@rameshlaus) October 12, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.