యాప్నగరం

Amala Paul: ‘‘అమల విడాకులు తీసుకోవడానికి రజినీకాంత్ అల్లుడే కారణం’’

ప్రముఖ తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్, నటి అమలా పాల్ ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయిన సంగతి తెలిసిందే. అయితే వీరు విడిపోవడానికి కారణం రజినీకాంత్ అల్లుడు ధనుషేనట.

Samayam Telugu 2 Feb 2020, 2:38 pm
తమిళ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ తండ్రి అళగప్పన్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. విజయ్, సినీ నటి అమలా పాల్ కొన్నేళ్ల క్రితం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లైన నాలుగేళ్లకే ఇద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు కారణం అమల, విజయ్ చెప్పలేదు. పెళ్లి తర్వాత కూడా అమల సినిమాల్లో నటిస్తాను అన్నందుకు అత్తింటివారు ఒప్పుకోలేదని వార్తలు వచ్చాయి. అయితే అమల, విజయ్ విడిపోవడానికి అసలు కారణం సూపర్‌స్టార్ రజినీకాంత్ అల్లుడు, సినీ నటుడు ధనుషేనంటూ అళగప్పన్ షాకింగ్ ఆరోపణలు చేశారు.
Samayam Telugu vijay amala paul
విజయ్ అమలా పాల్


‘అమల, విజయ్ విడిపోవడానికి కారణం ధనుషే. ధనుష్ తన సొంత నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ఫిలింస్‌పై ‘అమ్మ కనక్కు’ అనే సినిమాను తెరకెక్కించాలని అనుకున్నాడు. ఇందులో అమలా పాల్‌ను హీరోయిన్‌గా తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని అమలకు కూడా చెప్పాడు. అయితే పెళ్లి తర్వాత నటించకూడదని అమల నిర్ణయించుకుంది. సరిగ్గా అప్పుడే ధనుష్ ఈ ఆఫర్‌ను అమలకు ఇవ్వడంతో ఆమె సినిమాకు ఓకే చెప్పింది. ముందు సినిమాలు చేయనని చెప్పి ఆ తర్వాత ఇంట్లో వారితో ఒక్కమాటైనా చెప్పకుండా సినిమాకు ఓకే చేయడం విజయ్‌కు నచ్చలేదు. దాంతో వారి దాంతప్య జీవితాల్లో విభేదాలు వచ్చాయి. అందుకే విడిపోయారు’ అని వెల్లడించారు.

READ ALSO:అవును, మాజీ భర్తను చిత్రహింసలు పెట్టాను: ఒప్పేసుకున్న స్టార్ నటి

ఈ విషయం ఇప్పటివరకు ఎవ్వరికీ తెలీదు. దాంతో అళగప్పన్ వ్యాఖ్యలపై కోలీవుడ్ షాక్‌కు గురైంది. మరి దీనిపై అమల, విజయ్, ధనుష్ ఏమంటారో వేచి చూడాలి. మరోపక్క విజయ్ ఇటీవల మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. అమల కూడా మరో వ్యక్తితో ప్రేమలో ఉన్నారని ఓసారి వెల్లడించారు.
See Photo Story: యథార్థ ఘటన ప్రేరణతో 'ఆనందభైరవి'.. ఎవరెవరున్నారు?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.