యాప్నగరం

స్వామీజీ అనుకొని దండం పెట్టుకున్నారు.. కానీ: అలీ

దేశముదురు షూటింగ్ సమయంలో స్వామీజీ అనుకొని కాళ్లకు దండం పెట్టుకున్నారు. కానీ తిరిగి వెళ్లేటప్పుడు నా గెటప్ చూసి..

Samayam Telugu 18 Mar 2018, 1:58 pm
తన హాస్యంతో తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించే అలీ... సినీ ఇండస్ట్రీలో 40 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్నాడు. తన కామెడీ టైమింగ్ బాల నటుడిగా తెలుగు ప్రేక్షకులు దగ్గరయిన అలీ తన అనుభవాలను ఇటీవల ఓ ప్రముఖ దినపత్రికతో పంచుకున్నారు. ఈ సందర్భంగా దేశముదురు సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఫన్నీ సంఘటనను అలీ బయటపెట్టారు. ఆ సినిమాలో అలీ స్వామీజీగా కనిపించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu ali revealed funny incident at desamuduru shooting time
స్వామీజీ అనుకొని దండం పెట్టుకున్నారు.. కానీ: అలీ


‘కులు మనాలిలోని హిడింబ దేవాలయం దగ్గర షూటింగ్ జరుగుతోంది. మాకు దగ్గర్లోనే అఘోరాలు ఉండేవారు. స్వామీజీ వేషంలో ఉన్న నన్ను కూడా నిజం స్వామిగానే భావించిన మూడు జంటలు నా దగ్గరకొచ్చాయి. షూటింగ్ అని తెలియక నా కాళ్లకు దండం పెట్టుకొని వెళ్లిపోయారు. కాసేపయ్యాక వేషం తీసేసి కూర్చున్నాను. తిరిగి వెళ్తున్నప్పుడు నన్ను చూసి.. వెళ్లేటప్పుడు దండం పెట్టుకుంది వీడికా అని నవ్వుకున్నార’ని అలీ చెప్పారు.

‘రాజేంద్రుడు గజేంద్రుడు’ షూటింగ్‌లో ఎంద చాట అనే మళయాళీ డైలాగ్‌లు తాను సొంతంగా చెప్పిందేనని అలీ చెప్పారు. తను డైలాగ్ చెప్పాక కెమెరామెన్‌ శరత్‌ కెమెరా వదిలిపెట్టి బయటికి వెళ్లి నవ్వుకున్నాడు. నా యాక్టింగ్ కంటే.. బ్రహ్మానందం రియాక్షన్‌ని చూసి ఎక్కువగా నవ్వుకున్నారని అలీ తెలిపాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.