యాప్నగరం

ప్రభాస్, ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్!!

బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా బాలీవుడ్ హీరోయిన్లకు ఫేవరెట్ అయిపోయాడు. ఎంతగా అంటే, ఒక్క చిత్రంలోనైనా సరే....

TNN 15 May 2017, 8:08 pm
బాహుబలి 2 సినిమా తర్వాత ప్రభాస్ ఒక్కసారిగా బాలీవుడ్ హీరోయిన్లకు ఫేవరెట్ అయిపోయాడు. ఎంతగా అంటే, ఒక్క చిత్రంలోనైనా సరే అతడితో స్క్రీన్ పంచుకోవాలని కలలుగనేంత. ‘సాహో’లో ప్రభాష్ పక్కన నటించేందుకు బాలీవుడ్ బామలను వెతుకుతున్న నేపథ్యంలో... ఆ అవకాశం తమకి వస్తే చాలాని మనసులో మాట బయట పెట్టేస్తున్నారు.
Samayam Telugu alia bhatt wants to work with prabhas
ప్రభాస్, ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్!!


అయితే, ‘సాహో’లో ప్రభాస్ సరసన కత్రినా కైఫ్‌కు అవకాశం దక్కొచ్చననే ప్రచారం ఊపందుకుంది. కానీ, అధికారికంగా ఎవరి పేరు ప్రకటించలేదు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభాస్ పక్కన నటించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అలియా భట్ ప్రకటించింది.

ట్విట్టర్‌లో తన ఫ్యాన్స్‌ అడిగిన ప్రశ్నలకు అలియా.. సౌత్ ఇండియాలో తన ఫేవరెట్ స్టార్ ప్రభాస్ అని తెలిపింది. మన బాహుబలిని ‘రాక్-బాస్టర్’ అంటూ అలియా పొగడ్తలతో ముంచెత్తింది. ప్లీజ్ ఒకే ఒక్క ఛాన్స్ అంటూ.. సంకేతాలు పంపిన ఈ అమ్మడి కల నెరవేరుతుందో లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.