యాప్నగరం

పవన్ కళ్యాణ్‌కి 100 ముద్దులు.. చిరంజీవిని చూడగానే ఏడ్చేశా! సీక్రెట్స్ బయటపెట్టిన సురేఖా వాణి

'ఆలీతో సరదాగా' ప్రోగ్రాంకి గెస్టుగా వచ్చిన సురేఖా వాణి తన లైఫ్‌లో జరిగిన చాలా విషయాలపై ఓపెన్ అయింది. ఒకానొక సందర్భంలో చిరంజీవిని చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నా అని చెప్పుకొచ్చింది.

Samayam Telugu 11 May 2021, 3:43 pm

ప్రధానాంశాలు:

  • 'ఆలీతో సరదాగా' సురేఖా వాణి ముచ్చట్లు
  • చాలా విషయాలపై ఓపెన్ కామెంట్స్
  • చిరంజీవి టాపిక్ రావడంతో ఆమె..
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu పవన్ కళ్యాణ్‌కి 100 ముద్దులు.. చిరంజీవిని చూడగానే ఏడ్చేశా!
Surekha Vani
క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితం సురేఖా వాణి. ఎన్నో సినిమాల్లో అక్కగా, వదినగా, అత్తగా తనదైన నటనతో ఆకట్టుకున్న ఆమె సోషల్ మీడియాలోనూ యమ యాక్టివ్ రోల్ పోషిస్తుంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన అన్ని విషయాలను ఫ్యాన్స్‌తో పంచుకోవడం సురేఖ హ్యబీ. ఈ నేపథ్యంలో తాజాగా 'ఆలీతో సరదాగా' మాట్లాడుతూ తన లైఫ్, కెరీర్‌లోని కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది సురేఖా వాణి.
గత కొన్నేళ్లుగా 'ఆలీతో సరదాగా' ప్రోగ్రాం ద్వారా తారలకు సంబంధించిన ఎన్నో విషయాలు ప్రేక్షకులకు తెలుస్తున్నాయి. ఈ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీ.. గెస్టుల నుంచి కీలక సమాచారం రాబడుతుంటారు. అలా అలా సరదాగా సురేఖా వాణితో ముచ్చటిస్తూ చిరంజీవి టాపిక్ తీశారు ఆలీ. చిరంజీవి గారిని మొదటి చూడగానే మీరు ఏడ్చేశారట.. నిజమేనా? అని అడగడంతో అసలు విషయం బయటపెట్టింది సురేఖా వాణి.

''అదేంటో.. తెలియలే ఆయన్ను చూడాగానే పట పటా కన్నీళ్లు వచ్చేశాయి. నేనలా ఏడుస్తుంటే ఆయన నా దగ్గరకొచ్చి అయ్యో! ఎందుకు ఏడుస్తున్నావ్. ఏడవకు.. ఏడవకు అని గట్టిగా పట్టుకొని హగ్ చేసుకున్నారు. ఒక్కోసారి గుళ్లోకి వెళ్లినపుడు దేవుడిని చూస్తే ఏడుపొస్తుంది.. అలాగే చిరంజీవి గారిని చూస్తే కూడా నాకు ఏడుపొచ్చేసింది'' అని సురేఖా వాణి తెలిపింది. చిరంజీవితో కలిసి స్టాలిన్ సినిమాలో నటించానని, ఆ తర్వాత ఓ రోజు ఆయన పర్సనల్‌గా పిలిచి తనతో మాట్లాడారని ఆమె తెలిపింది.
మంచు లక్ష్మి ఇంగ్లీష్ ట్వీట్‌ వైరల్.. నీ చర్యలు ఊహాతీతం అక్కా!! మళ్లీ బుక్కైపోయిన స్టార్ డాటర్
పెళ్లికి ముందే నారాయణ మూర్తి గారితో 'తెలుగోడు' సినిమాతో సినీ ఎంట్రీ ఇచ్చి.. పెళ్లి తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి బిడ్డ పుట్టాక మళ్లీ సినిమాలు చేశానని చెప్పుకొచ్చింది సురేఖా వాణి. ఆలీ అడిగిన అన్ని ప్రశ్నలపై ఓపెన్‌గా మాట్లాడిన ఆమె.. 100 ముద్దులు ఇవ్వాలనుకునే హీరో ఎవరున్నారు? అనే ప్రశ్నపై పవన్ కళ్యాణ్ పేరు చెప్పింది. అలాగే తనకు కత్తిలా ఉంది అనిపించే హీరోయిన్ శ్రీదేవి అని సురేఖ చెప్పింది. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.