యాప్నగరం

ఉదయ్ కిరణ్ ఆఖరిగా మాట్లాడింది ఆ హీరోతోనే!

టాలీవుడ్ లో లవర్ ఇమేజ్ ను సంపాదించుకొని వరుస హిట్స్ తో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్. అయితే ఆ తరువాత వరుస ఎదురుదెబ్బలు తగలడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.

TNN 24 Oct 2016, 5:50 pm
టాలీవుడ్ లో లవర్ ఇమేజ్ ను సంపాదించుకొని వరుస హిట్స్ తో అతి తక్కువ సమయంలో స్టార్ హీరోగా ఎదిగాడు ఉదయ్ కిరణ్. అయితే ఆ తరువాత వరుస ఎదురుదెబ్బలు తగలడంతో తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోయి ఇప్పటికి మూడేళ్లు గడిచిపోయాయి. అయితే ఉదయ్ మరణం గురించి ఆయన మిత్రుడు అల్లరి నరేశ్ ఓ కామెంట్ చేశాడు.
Samayam Telugu allari naresh revealed about the last days of uday kiran
ఉదయ్ కిరణ్ ఆఖరిగా మాట్లాడింది ఆ హీరోతోనే!

ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు రోజు నరేశ్ ను కలిశాడట. ఆ సమయంలో ఉదయ్ ఎంతో బాధగా కనిపించినట్లు నరేశ్ వెల్లడించాడు. కారణం అడగగా పేపర్ లో వచ్చిన ఆర్టికల్‌లో యువ హీరో కథలు సరిగ్గా ఎన్నుకోవట్లేదని రాసి ఉన్నట్లు చెప్పాడట ఉదయ్. దానికి అంత బాధ పడాలా నీకు సంబంధించింది కాదు కదా అని నరేష్ అడగ్గా, హీరోల స్టోరీ సెలెక్షన్ లో మార్పు రాకపోతే ఉదయ్ కిరణ్ కి పట్టినగతే పడుతుందని అందులో రాశారని బాధపడ్డాడట ఉదయ్ కిరణ్. బాధల్లో ఉన్న అతడిని ఆ ఆర్టికల్ మరింత మనస్తాపానికి గురి చేసిందని, తన మరణానికి అది కూడా ఓ కారణం కావొచ్చని అల్లరి నరేష్ అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.