యాప్నగరం

అల్లు అర్జున్‌కు స్వీట్ గిఫ్ట్ ఇచ్చిన కూతురు.. రాశీ ఖన్నా ఆశ్చర్యం!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు ఆయన కూతురు అర్హ స్వీట్ గిఫ్ట్ ఇచ్చింది. ఈ విషయాన్ని బన్నీ స్వయంగా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు.

Samayam Telugu 14 Jul 2019, 4:59 pm
ఎప్పుడూ సినిమాలతో బిజీగా ఉండే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాస్త విరామం దొరికితే తన పిల్లలతోనే సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. కొడుకు అయాన్, కూతురు అర్హాతో సరదాగా ఆడుకుంటారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. తన పిల్లలతో సరదాగా గడిపిన సమయంలో తీసుకున్న ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా అలాంటి ఫొటో ఒకదాన్ని అర్జున్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన తండ్రికి అర్హా ఒక బహుమతి ఇస్తోన్నట్లు ఉన్న ఫొటో అది.
Samayam Telugu Arha

View this post on Instagram My Sweetheart gave me a hand made pot with flowers ❤️ A post shared by Allu Arjun (@alluarjunonline) on Jul 13, 2019 at 11:50pm PDT
‘చేతితో చేసిన కుండలో పువ్వులు పెట్టి దాన్ని నా స్వీట్‌హార్ట్ నాకు ఇచ్చింది’ అని ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో బన్నీ పేర్కొన్నారు. ఫొటో చాలా బాగుంది. ఆ ఫొటోలో అర్హ, ఫ్లవర్ వాజ్, దాన్ని అందుకుంటోన్న బన్నీ చేయి మాత్రే కనిపిస్తున్నాయి. ఈ ఫొటోను చూసిన బన్నీ అభిమానులు ఎంత బాగుందో అంటూ మురిసిపోతున్నారు. కేవలం అభిమానులేనా.. హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఆశ్చర్యానికి గురయ్యారు. ‘హవ్ క్యూట్!!!’ అంటూ కామెంట్ పెట్టారు.
కాగా, బన్నీ ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నారు. ఓవైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు తన పాత్రకు డబ్బింగ్ చెప్పడం కూడా మొదలుపెట్టారు. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. ఎస్.ఎస్.తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ పతాకాలపై ఎస్.రాధాకృష్ణ, అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’ అనే సినిమాలో అల్లు అర్జున్ నటిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.