యాప్నగరం

విజయ్ దేవరకొండతో సినిమా.. ఆ నిర్మాత బన్నీకి క్లోజ్ ఫ్రెండ్

విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్‌లో సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం ద్వారా కేదార్ అనే నిర్మాత చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

Samayam Telugu 2 Oct 2020, 11:32 pm
సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో సినిమా ప్రకటించి అందరి దృష్టిని ఆకర్షించారు యంగ్ ప్రొడ్యూసర్ కేదార్ సెలగంశెట్టి. ఒక భారీ ప్రాజెక్ట్‌తో టాలీవుడ్‌కు పరిచయం అవుతోన్న కేదార్.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు క్లోజ్ ఫ్రెండ్. ఈ విషయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కేదార్ తాజాగా అల్లు అర్జున్‌ను కలిశారు. తన స్నేహితుడిని ఇండస్ట్రీలోకి సాదరంగా ఆహ్వానిస్తూ బన్నీ అభినందనలు తెలిపారు.
Samayam Telugu బన్నీతో కేదార్
Allu Arjun and Kedar


తన ఫాల్కన్ క్రియేషన్స్ బ్యానర్‌పై విజయ్ దేవరకొండ, సుకుమార్ కాంబినేషన్‌లో కేదర్ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం 2022లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రకటన రోజున మొక్కను కేదార్‌కు బహుమతిగా పంపారు అల్లు అర్జున్. ఇప్పుడు పర్సనల్‌గా విషెస్ తెలిపారు.

Also Read: ‘సింహా’తో 15 రోజులు ట్రావెల్ చేశా.. ఆ బాధ జీవితాంతం ఉంటుంది: పరుచూరి చెప్పిన ఆసక్తికర విషయాలు

ఇదిలా ఉంటే, ప్రస్తుతం బన్నీ.. సుకుమార్‌తో ‘పుష్ప’ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ముత్తంశెట్టి మీడియాతో కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. అల్లు అర్జున్ సరసన రష్మికా మందన హీరోయిన్‌గా నటించనుంది. మరోవైపు, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ సినిమా చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా మూవీ. ఈ రెండు సినిమాలు పూర్తయిన తరవాత విజయ్-సుకుమార్ కాంబో సెట్స్‌పైకి వెళ్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.