యాప్నగరం

Allu Arha: పావులు కదుపుతున్న బన్నీ కూతురు.. ఆట రె‘ఢీ’.. బాప్ రే అనిపిస్తున్న వీడియో

టాప్ లేచిపోద్ది అంటూ నాన్న డాన్స్‌తో టాప్ లేపుతుంటే.. ఆటల్లో టాప్ లేపేందుకు రెడీ అవుతోంది అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ. ఖాళీ సమయం దొరికితే చాలు పిల్లలతో గడిపే అల్లు అర్జున్.. వారి ఆట పాటల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు.

Samayam Telugu 10 Jun 2021, 12:10 pm
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిందే. ఖాళీ సమయం దొరికితే భార్య ఇద్దరు పిల్లలతో ఆయన సరదాగా గడుపుతుంటారు. ముఖ్యంగా ముద్దుల కూతురు అర్హతో కలిసి ఆయన చేసే అల్లరి అంతా ఇంతా కాదు. వీరిద్దరు కలిసి అల్లరి చేసే వీడియోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి తరచూ సోషల్‌మీడియాలో షేర్ చేస్తుంటారు. ఈ వీడియోల తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆమె అర్హకు సంబంధించిన ఓ వీడియోని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నారు.
Samayam Telugu అల్లు అర్జున్, అర్హ
allu arjun daughter arha


ఈ వీడియోలో అర్హ చెస్ ఆడుతూ వారెవ్వా అనిపిస్తుంది. చెస్‌లోని అన్ని పావులను ఆమె క్రమ పద్దతిలో అమర్చి ఆటకు సై అంటోంది. ఈ వీడియో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇంత చిన్న వయస్సులోనే అర్హ చెస్‌లో పట్టు సాధించడాన్ని వాళ్లు అభినందిస్తున్నారు.

View this post on Instagram A post shared by Allusnehareddy (@allu.sneha.reddy)

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయాకొస్తే.. అతను ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.