యాప్నగరం

ఆట మొదలు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘బన్నీయిజం’

టాలీవుడ్‌లో ఇప్పటికే పవనిజం ఉండగా.. ఇప్పుడు కొత్త ‘బన్నీయిజం’ మొదలవుతోంది. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బన్నీయిజాన్ని మొదలుపెట్టారు.అ

TNN 21 Jan 2018, 2:09 pm
టాలీవుడ్‌లో మెగా హీరోలకున్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్‌ అంటే ఫ్యాన్స్‌కు అంతులేని అభిమానం. తమ హీరోను ఎవరైనా ఒక మాటంటే వీరు తట్టుకోలేరు. అందుకే కత్తి మహేష్‌, పవన్ అభిమానుల మధ్య నాలుగు నెలలపాటు వివాదం నడిచింది. ఇది పక్కనబెడితే.. గబ్బర్ సింగ్ హిట్ తర్వాత హరీష్ శంకర్ నుంచి ‘పవనిజం’ అనే మాట బయటకు వచ్చింది. పవన్‌ను దేవుడిలా ఆరాధించే అభిమానులకు పవనిజం ఓ మతంలా మారింది.
Samayam Telugu allu arjun fans starts bunnyism
ఆట మొదలు.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘బన్నీయిజం’


ఇప్పుడు తాజాగా మెగా క్యాంప్ నుంచే మరో ఇజం బయటకు వస్తోంది. అదే బన్నీయిజం. అల్లు అర్జున్ ఫ్యాన్స్ బన్నీయిజం అనే పదాన్ని వాడటం మెల్లగా మొదలుపెట్టారు. ఇటీవల బన్నీ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచే ఏఏఆర్మీ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. నాపేరు సూర్య సినిమాలో బన్నీ ఆర్మీ అధికారి పాత్ర పోషిస్తుండటంతో.. ఇది పాపులర్ అయ్యింది. దీంతోపాటు బన్నీయిజం అనే పదాన్ని కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు.


‘అవసరంలో ఉన్నవారికి సాయం చేయడానికి బన్నీ ఎప్పుడు ఆలోచించడు. మెగా అభిమానుల్లో ఎవరైనా చనిపోతే వారి కుటుంబాలను కలవడం, వారికి సాయం చేసే విషయంలో ముందుంటాడు. ఓ అభిమాని మరణిస్తే.. అతడి ముగ్గురి పిల్లల బాధ్యతలను బన్నీ తీసుకున్నాడు. వారికి ఉచితంగా చదువు చెప్పిస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఆర్థిక సాయం చేశాడు. నిర్మాతల పట్ల కూడా కేరింగ్‌గా ఉంటాడు. ప్రజలకు అవగాహన కల్పించడం కోసం స్వీయ నిర్మాణంలో ‘ఐ యామ్ దట్ ఛేంజ్’ షార్ట్ ఫిల్మ్‌లో నటించాడు. ఇవన్నీ చేస్తున్నాడు కాబట్టి ఫ్యాన్స్‌కు అతడంటే ఎంతో ప్రేమ. అలాంటప్పుడు బన్నీయిజం గురించి మాట్లాడితే తప్పేంట’ని ఓ ఫ్యాన్ చెప్పాడు.

మొత్తానికి పవనిజం లాగే టాలీవుడ్‌లో బన్నీయిజం కూడా మొదలవుతోందన్న మాట. కాకపోతే ఈ ఇజాలు.. మెగా ఫ్యామిలీలో పోటీకి దారితీసే ప్రమాదం ఉందనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.