యాప్నగరం

అల్లుఅర్జున్ బైక్ నెంబరుపై పవన్ అభిమానుల సెటైర్లు

పవన్ గురించి మాట్లాడని వారు అతని నెంబరు ఎందుకు వాడుకోవాలంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు

TNN 21 Feb 2017, 2:37 pm
పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ అభిమానుల మధ్య గత కొంతకాలంగా కోల్డ్ వార్ నడుస్తోంది. గత ఏడాది ఓ ఆడియో వేడుకలో పవన్ గురించి ‘చెప్పను బ్రదర్’ అంటూ అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు పవన్ అభిమానులకు కోపం తెప్పించాయి. ఇటీవల అల్లుఅర్జున్ నూతన చిత్రం ‘డీజే.. దువ్వాడ జగన్నాథమ్’ ఫస్ట్ లుక్ విడుదలవగా.. అందులో అల్లు అర్జున్ వాడిన బైక్ నెంబరుపై పవన్ అభిమానులు సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు.
Samayam Telugu allu arjun gets pawan kalyan number
అల్లుఅర్జున్ బైక్ నెంబరుపై పవన్ అభిమానుల సెటైర్లు


గబ్బర్ సింగ్ సినిమాలో పవన్ కల్యాణ్ వినియోగించిన బైక్ నెంబరు ఏపీ 27 జీఎస్ 2425 కాగా.. డీజేలో అల్లు అర్జున్ వాడిన బైక్ నెంబరు ఏపీ 16 ఈఏ 2425. దీంతో పవన్ గురించి మాట్లాడేందుకు ఇష్టపడని వారు ఇలా అతని బైక్ నెంబరు ఎందుకు వాడుకోవాలంటూ పవన్ అభిమానులు అల్లు అర్జున్‌పై సోషల్ మీడియాలో సెటైర్లు విసురుతున్నారు. అయితే ఈ నెంబరు డీజే దర్శకుడు హరీశ్ శంకర్‌ది కావడంతోనే ఈ సినిమాలో వాడినట్లు తెలుస్తోంది. అన్నట్లు గబ్బర్ సింగ్ డైరెక్టర్ కూడా హరీశ్ శంకర్ అని తెలుసు కదా..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.