యాప్నగరం

ప్రియా ప్రకాష్ వర్సెస్ అల్లు అర్జున్

కన్ను కొట్టి కుర్రాళ్ల గుండెల్ని దోచేసిన ప్రియా వారియర్‌ రేంజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఈ సీన్‌కు పేరడీలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరారు అల్లు అర్జున్. ప్రియా సీన్‌ చాలా క్యూట్‌గా ఉందంటూ ట్వీట్ చేసిన స్టైల్ స్టార్... ఇప్పుడు పేరడీ సీన్‌తో ఆకట్టుకున్నారు.

TNN 24 Feb 2018, 5:10 pm
కన్ను కొట్టి కుర్రాళ్ల గుండెల్ని దోచేసిన ప్రియా వారియర్‌ రేంజ్ ఏమాత్రం తగ్గడం లేదు. సోషల్ మీడియాలో ఈ సీన్‌కు పేరడీలు కూడా వచ్చేశాయి. ఇప్పుడు ఈ లిస్ట్‌లో చేరారు అల్లు అర్జున్. ప్రియా సీన్‌ చాలా క్యూట్‌గా ఉందంటూ ట్వీట్ చేసిన స్టైల్ స్టార్... ఇప్పుడు పేరడీ సీన్‌తో ఆకట్టుకున్నారు. కుమారుడు అయాన్‌తో కలిసి ఈ వీడియోలో సందడి చేశాడు. సేమ్ టు సేమ్ ప్రియా వారియర్‌లా... రెండు వేళ్లకు ముద్దు పెట్టి... తుపాకీలో తన కుమారుడికి గురి పెట్టాడు. తండ్రిలా తాను చేయడానికి ప్రయత్నించిన అయాన్... తర్వాత టేబుల్‌పై నుంచి బెడ్‌పైకి దూకేశాడు.
Samayam Telugu allu arjun imitates priya prakash varrier manikya malaraya poovi scene
ప్రియా ప్రకాష్ వర్సెస్ అల్లు అర్జున్


సరదాగా తీసిన ఈ వీడియోను బన్నీ సతీమణి స్నేహారెడ్డి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ సీన్‌కు ఒరు అదార్ లవ్ అనే హ్యాష్‌టాగ్‌ ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఈ సీన్ చూసి ఫిదా అవుతున్నారు. వావ్ సో క్యూట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి బన్నీ కూడా ప్రియా ఫ్యాన్స్ లిస్ట్‌లో చేరడమే కాదు... ఆమె వీడియోకు బాగా కనెక్ట్ అయ్యారు.

  #oruadaarlove A post shared by Sneha (@allusnehareddy) on Feb 23, 2018 at 10:45pm PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.