యాప్నగరం

దువ్వాడ జగన్నాథం వార్నింగ్!

అల్లు అర్జున్, హరీష్ శంకర్‌ల కాంబినేషన్ లో 'దువ్వాడ జగన్నాథం' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో చిత్రబృందం ఎంతో కేర్ తీసుకుంటుంది.

TNN 30 Jan 2017, 8:54 pm
అల్లు అర్జున్, హరీష్ శంకర్‌ల కాంబినేషన్ లో 'దువ్వాడ జగన్నాథం' సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో చిత్రబృందం ఎంతో కేర్ తీసుకుంటుంది. ముఖ్యం బన్నీ సినిమాకు సంబంధించి చిన్న విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా ఉంటున్నాడు. అయితే ఈ సినిమాలో సంగీత్ సీన్ ఒకటి ఉంటుందట. దానికోసం అలంకరణతో కూడిన భారీ సెట్ ను ఏర్పాటు చేశారట. ఆ ఒక్క సీన్ కోసం చాలా మంది మోడల్స్‌ను కూడా తీసుకు వచ్చినట్లు తెలుస్తోంది.
Samayam Telugu allu arjun serious warning to duvvada jagannadham set issue
దువ్వాడ జగన్నాథం వార్నింగ్!


అయితే అందమైన సెట్‌లో ఆ అందమైన అమ్మాయిలు ఫోటోలు తీసుకోవడం మొదలుపెట్టారట. గ్రూప్ ఫోటోలు, సెల్ఫీలు అంటూ నానా హంగామా చేస్తుండటంతో బన్నీకు కోపం వచ్చి.. ఒక్క ఫోటో కూడా బయటకు వెళ్లడానికి వీళ్ళేదంటూ వార్నింగ్ ఇచ్చాడట. అంతేకాదు అసలు సంగీత్ సెట్‌లో ఫోటోలు తీసుకోవద్దని నిర్మొహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. షూటింగ్ ప్లేస్ కానీ దాని వివరాలు కానీ ఎవరికి తెలియడానికి వీల్లేదని కావాలంటే సెట్ బయట ఫోటోలు తీసుకోమని ఆదేశించినట్లు సమాచారం.

దీంతో చిన్నబోయిన ఆ ముద్దుగుమ్మలు చేసేదేమే లేక వారి ఫోన్లను పక్కన పెట్టేసినట్లు ఫిల్మ్ నగర్ టాక్. మొత్తానికి బన్నీ మాత్రం సినిమా పట్ల గట్టిగానే కేర్ తీసుకుంటున్నట్లు ఈ సంఘటనతో రుజువైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.