యాప్నగరం

అల్లువారి అబ్బాయితో సచిన్ బెస్ట్ సెల్ఫీ!

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ గురువారం ట్విట్టర్‌లో ఒక ఫొటో ట్వీట్ చేసాడు.

TNN 8 Dec 2016, 4:54 pm
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ గురువారం ట్విట్టర్‌లో ఒక ఫొటో ట్వీట్ చేసాడు. ఇప్పుడది సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. కారణం అది సాదాసీదా ఫొటోకాదు.. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో దిగింది మరి. ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో భాగంగా గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన బెంగళూరు బ్లాస్టర్స్ ప్రచార కార్యక్రమంలో అల్లు అర్జున్ పాల్గొన్నాడు. ఈ సందర్భంగా జట్టు సహ యజమానులు సచిన్ టెండూల్కర్, చాముండేశ్వరీనాథ్, నిమ్మగడ్డ ప్రసాద్‌తో పాటు పుల్లెల గోపీచంద్‌తో దిగిన సెల్ఫీని అర్జున్ ట్విట్టర్‌లో పెట్టాడు. ‘నా బెస్ట్ సెల్ఫీల్లో ఇదొకటి! దిగ్గజ క్రీడాకారులు, జట్టు సహయజమానులతో కలిసి పనిచేయడం గొప్ప గౌరవం’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు. ఇంతకీ ఈ సెల్ఫీని సచిన్ స్వయంగా తీయడం విశేషం.
Samayam Telugu allu arjun shares best selfie with sachin tendulkar
అల్లువారి అబ్బాయితో సచిన్ బెస్ట్ సెల్ఫీ!

One of my Best selfie's ! Legendary Sports men ! Great Honour being associated & Co-owners of the Team #BengaluruBlasters pic.twitter.com/n9DjljUpPW — Allu Arjun (@alluarjun) December 8, 2016

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.