యాప్నగరం

ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ఇలా.. నిహారిక పెళ్లిలో రచ్చరచ్చే! భార్యపై బన్నీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

నిహారిక డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం మెగా, అల్లు ఫ్యామిలీస్ ఉదయ్‌పూర్ చేరుకున్నాయి. ఈ మేరకు తన విమాన ప్రయాణం తాలూకు పిక్స్ షేర్ చేస్తూ భార్య స్నేహారెడ్డిపై స్వీట్ కామెంట్ చేశారు అల్లు అర్జున్.

Samayam Telugu 7 Dec 2020, 5:29 pm
మెగా పెళ్లి వేడుకకు ముహూర్తం దగ్గరపడింది. రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌లో ఉన్న ప్యాలస్‌లో అంగరంగ వైభవంగా జరగనున్న నిహారిక వివాహ మహోత్సవానికి మెగా ఫ్యామిలీ అంతా హాజరు కానుంది. మెగా కాపౌండ్ యువ హీరోలతో పాటు చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. డిసెంబర్ 9వ తేదీన జరగనున్న ఈ మెగా సంబరాల్లో పాల్గొనేందుకు గాను ఇప్పటికే ప్రత్యేక విమానాల్లో మెగాస్టార్ ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ ఉదయ్‌పూర్‌ చేరుకుంది.
Samayam Telugu ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో ఇలా.. నిహారిక పెళ్లిలో రచ్చరచ్చే
Allu Arjun Family


ఈ రోజు (సోమవారం) ఉదయాన్నే వరుణ్ తేజ్, నిహారికలతో నాగబాబు ఫ్యామిలీ ఉదయ్‌పూర్ చేరుకోగా.. చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, ఉపాసన, అల్లు ఫ్యామిలీ అంతా ప్రత్యేక విమానాల్లో మధ్యాహ్నం వరకు పెళ్లి వేదిక వద్దకు చేరారు. దీంతో మెగా, అల్లు ఫ్యామిలీలు ఉదయ్‌పూర్ బయల్దేరిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా, తమ ఫ్యామిలీతో జాలీగా విమానంలో ప్రయాణిస్తున్న ఫొటోలను తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పంచుకున్న అల్లు అర్జున్.. తన భార్య స్నేహరెడ్డిని ఉద్దేశిస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు.
View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)

విమానంలో కూర్చొని ఉన్న స్నేహ ఫోటో షేర్ చేస్తూ 'క్యూటీ' అంటూ లవ్ సింబల్ ఎమోజీతో స్వీట్ కామెంట్ పెట్టారు బన్నీ. ఈ ప్రయాణంలో తన కూతురు, కొడుకుతో గడిపిన ఆనంద క్షణాలను పోస్ట్ చేశారు. అలాగే తన తల్లిదండ్రులు, భార్యాపిల్లలతో విమానం దిగాక దిగిన కంప్లీట్ పిక్ షేర్ చేస్తూ.. ''ఎన్నో ఏళ్ల తర్వాత ఫ్యామిలీతో విమాన ప్రయాణం.. నిహారిక, చైతన్య పెళ్లి సంబరాలు షురూ'' అని కామెంట్ చేశారు. ఈ ఫొటోల్లో బన్నీ యమ స్టైలిష్‌గా కనిపిస్తుండటమే గాక.. ఆ హుషారు చూసి మెగా వేడుకలో అల్లువారి హవా మామూలుగా ఉండకపోవచ్చు అంటున్నారు నెటిజన్లు.

Also Read: ఒక్కపైసా ఖర్చు లేకుండా హనీమూన్.. భర్తకు రూ.5 కోట్లు ఆదా చేసిన కాజల్!

గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకర్ రావు కుమారుడు జొన్నలగడ్డ వెంకట చైతన్యను నిహారిక పెళ్లాడనుంది. ఆగస్టులో జరిగిన నిశ్చితార్థం మొదలుకొని ఈ క్షణం వరకు నిహారిక- చైతన్య జోడీ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. నిహారిక పెళ్లి వేడుకను చూడాలని ఎంతో ఆతృతగా ఉన్నారు మెగా ఫ్యాన్స్.
View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)
View this post on Instagram A post shared by Allu Arjun (@alluarjunonline)

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.