యాప్నగరం

బన్నీ రెమ్యునరేషన్ అన్ని కోట్లే.. ‘పుష్ప’ కోసం బేరం తప్పలేదా?

సుకుమార్‌‌తో కలిసి హ్యాట్రిక్ హిట్ కొట్టేందుకు రెడీగా ఉన్నాడు బన్నీ. వీరి కాంబోలో వస్తున్న ‘పుష్ప’ ఫస్ట్ లుక్‌తోనే అంచనాలు పెంచేశారు.

Samayam Telugu 22 Jun 2020, 9:28 pm
ఈ సంక్రాంతికి ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ కాసులు వర్షం కురిపించింది ఈ చిత్రం. ముఖ్యంగా అల్లు అర్జున్ కెరియర్‌లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకోవడమే కాక.. సినిమా లాభాల్లో పాతిక శాతం వాటా తీసుకున్నారని టాక్.
Samayam Telugu అల్లు అర్జున్
Pushpa Movie


ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తున్నారు. అల్లు అర్జున్ కెరియర్‌లో పాన్ ఇండియా చిత్రంగా భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నఈ చిత్ర హిందీ, తమిళ మార్కెట్స్ రైట్స్‌లో సైతం బన్నీకి వాటా ఉన్నట్టు సమాచారం.

ఇవే కాకుండా పుష్ప చిత్రానికి గానూ బన్నీ ఏకంగా రూ. 35 కోట్ల భారీ రెమ్యునరేషన్ తీసుకోబోతున్నారట. దీంతో పాటు ‘అల వైకుంఠపురములో’ చిత్రం మాదిరే.. లాభాల్లోనే వాటా తీసుకోబోతున్నట్టు సమాచారం. అయితే కరోనా నేపథ్యంలో షూటింగ్‌కి బ్రేక్ పడటంతో పాటు నిర్మాతలకు బడ్జెట్ పెరిగిపోవడంతో తగ్గించే పనిలో పడ్డారట నిర్మాతలు. ఈ తరుణంలో బన్నీ భారీ రెమ్యునరేషన్‌ కూడా తగ్గించుకునే పనిలో ఉన్నారట. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్‌గా కనిపించనున్నాడు. రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. బన్నీ లక్కీ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సుకుమార్-బన్నీ హ్యాట్రిక్ మూవీ కావడంతో ‘పుష్ప’ చిత్రంపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.