యాప్నగరం

చరణ్ కోసం.. బన్ని చెప్తున్నాడు ‘బ్రదర్’

రామ్ చరణ్ , అల్లు అర్జున్ గతంలో ఎవడు సినిమాలో కలిసి నటించారు. తాజాగా....

TNN 24 Apr 2017, 8:51 pm
రామ్ చరణ్, అల్లు అర్జున్‌లు కలిసి గతంలో 'ఎవడు' సినిమాలో నటించారు. ఈ సినిమాలో వీరిద్దరికి కాంబినేషన్‌లో సీన్స్ లేనప్పటికీ ఆ చిత్రాన్ని మాత్రం మల్టీస్టారర్ కిందే లెక్కగట్టారు మెగాభిమానులు. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలిసి సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇది మల్టీస్టారర్ మాత్రం కాదు.
Samayam Telugu allu arjun voice over for ram charan movie
చరణ్ కోసం.. బన్ని చెప్తున్నాడు ‘బ్రదర్’


చరణ్ సినిమాకు బన్నీ తన వాయిస్ అందించబోతున్నాడు. అసలు విషయంలోకి వస్తే కన్నడలో విజయం సాధించిన 'బహద్దూర్' అనే చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు అల్లు అరవింద్. ఈ చిత్రంలో హీరోగా రామ్ చరణ్‌ను అనుకుంటున్నారు.

పక్కా యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు చరణ్ అయితేనే న్యాయం చేయగలడని నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాకు వాయిస్ ఓవర్ బన్నీతో చెప్పించాలని ప్లాన్ చేస్తున్నారు. కన్నడలో ఈ సినిమాకు పునీత్ రాజ్ కుమార్ వాయిస్ అందించాడు. అది సినిమాకు మంచి హైప్‌ను తీసుకొచ్చింది.

దీంతో అదే వాయిస్‌ను తెలుగులో బన్నీతో చెప్పబోతున్నాడట. ఇప్పటికే చాలా మంది స్టార్లు ఇతర హీరోల చిత్రాలకు తమ వాయిస్‌ను అందించారు. కానీ బన్నీ మాత్రం ఇప్పటివరకు ఆ ప్రయత్నం చేయలేదు. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.