యాప్నగరం

Ala Vaikunthapurramuloo: బన్నీ ఖాతాలో నాన్‌ బాహుబలి రికార్డ్‌.. మరి మహేష్!

సంక్రాంతి సీజన్‌లో భారీ చిత్రాలు పోటి పడటం అనేది చాలా కామన్‌. కానీ ఈ ఏడాది సంక్రాంతి మాత్రం మరింత రసవత్తరంగా మారింది. అల్లు అర్జున్‌ `అల వైకుంఠపురములో`, మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు` సినిమాలు ఒక్క రోజు గ్యాప్‌తో రిలీజ్‌ కావటంతో సంక్రాంతి పోటి మరింత వేడెక్కింది. అందుకు తగ్గట్టుగా ఈ ఇద్దరు హీరోలు పోటాపోటి రిలీజ్‌లు, పోటాపోటి కలెక్షన్ల పోస్టర్లతో సీజన్‌ను మరింత హీటెక్కిస్తున్నారు.

Samayam Telugu 22 Jan 2020, 6:57 pm

Samayam Telugu allu arjuns ala vaikunthapurramuloo new record
Ala Vaikunthapurramuloo: బన్నీ ఖాతాలో నాన్‌ బాహుబలి రికార్డ్‌.. మరి మహేష్!

ఒక్కరోజు ముందే బరిలో దిగిన మహేష్

సంక్రాంతి సీజన్‌లో ముందే బరిలో దిగాడు సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ సరిలేరు నీకెవ్వరు సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు సూపర్‌ హిట్ టాక్ రావటంతో సూపర్‌ స్టార్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఇప్పటికే రెండు వందల కోట్ల గ్రాస్‌ సాధించిన ఈ సినిమా మహేష్ కెరీర్‌ బెస్ట్ వసూళ్లు సాధించిందంటున్నారు చిత్రయూనిట్.

లేట్‌గా వచ్చినా గట్టిగా కొట్టిన బన్నీ

సంక్రాంతి బరిలో కాస్త వెనుక వచ్చిన మహేష్ సినిమాను దాటేశానని ప్రకటించుకున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌. ఈ సినిమా పది రోజుల్లో 220 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా చిత్రయూనిట్ అధికారికంగా వెల్లడించారు. అంటే దాదాపు 145 కోట్ల షేర్‌ సాధించినట్టుగా తెలుస్తోంది. సూపర్‌ హిట్ ఆడియోతో పాటు బన్నీ స్టైలిష్‌ పర్ఫామెన్స్‌, త్రివిక్రమ్‌ మార్క్‌ టేకింగ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యే కథా కథనాలు సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్‌ వచ్చేలా చేశాయి. దీంతో సినిమా రికార్డ్ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతోంది.

ముదురుతున్న పోస్టర్‌ వార్‌

అయితే కలెక్షన్లు ఎలా ఉన్నా.. ఈ రెండు చిత్రాల యూనిట్‌లు రిలీజ్ చేస్తున్న పోస్టర్లు మాత్రం అభిమానుల మధ్య అగ్గి రాజేస్తున్నాయి. ఇరు వర్గాలు నాన్‌ బాహుబలి రికార్డ్‌ అంటూ పోస్టర్‌లు రిలీజ్ చేయటంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ రెండు సినిమాల టీంలు మాత్రం ఏ మాత్రం వెనక్కి తగ్గటం లేదు. కేవలం గంటల వ్యవధిలోనే వంద కోట్ల షేర్‌ పోస్టర్లు వదిలి మహేష్‌, బన్నీలు. ఒక్క రోజు గ్యాప్‌లో 200 కోట్ల గ్రాస్‌ పోస్టర్లను రిలీజ్ చేశారు. అయితే రెండు సందర్భాల్లోనూ మహేష్ కన్నా బన్నీనే ఒక్క అడుగు ముందు ఉండుటం విశేషం.

See Photo Story: అల వైకుంఠపురములో డైలాగ్స్: గురూజీ సర్... గురూజీ అంతే..!

Twitter-#AlaVaikunthapurramuloo Collects 𝟐𝟐𝟎𝐜𝐫 𝐠𝐫𝐨...

Twitter-#SarileruNeekevvaru Bigger Than Ever... 💪🏼 SUPE...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.