స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్.. ఎమోషనల్ ట్వీట్ ద్వారా తన చిన్నారి తమ్ముడు అల్లు శిరీష్ పుట్టిన రోజు శుభాకాంక్షల్ని తెలియజేశారు. షూటింగ్‌లతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ కోసం టైం కేటాయించడంలో మహేష్ బాబులాగే అల్లు అర్జున్ కూడా ముందుంటారు. స్నేహారెడ్డి రెండో డెలివరీ సమయంలో ‘డీజే’ షూటింగ్‌ను సైతం పక్కన పెట్టి ఆమె పక్కనే ఉండి అన్నీ చూసుకున్నారు అల్లు అర్జున్. ఇక తన భార్య, పిల్లలతో గడిపిన మధుర క్షణాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే బన్నీ.. తాజాగా తన తమ్ముడు అల్లు శిరీష్ బర్త్ డే (మే 30 ఈరోజు) సందర్భంగా ఎమోషనల్ ట్వీట్ చేశారు.
‘నా లైఫ్‌లో తొలి చిన్నారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ చిన్నారి నా కళ్లముందే పెరిగి పెద్దయ్యాడు. నా జీవితంలో అతి ఎక్కువ జ్ఞాపకాలను షేర్ చేసుకుంది ఇతనితోనే. నా చిన్నారి తమ్ముడు సిరి (శిరీష్)కు పుట్టిన రోజు శుభాకాంక్షలు’ అంటూ.. తన భార్య పిల్లలతో కలిసి అల్లు శిరీష్ కేక్ కట్ చేయిస్తున్న ఫోటోను షేర్ చేశారు అల్లు అర్జున్. తమ్ముడి మీద అన్న చూపించిన ప్రేమకు బన్నీ ఫ్యాన్స్ ఫిదా అవుతూ.. రీట్వీట్స్తో కామెంట్స్ కూడా చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియా అల్లు వారి అబ్బాయిల ఫోటో వైరల్ అయ్యింది.
అయితే తన బర్త్ డే సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అల్లు శిరీష్.. నా కెరియర్లో నాన్న, అన్నయ్యల పాత్ర కీలకం అన్నారు. నా సినిమా కథల్ని నాతో పాటు నాన్నకు వినిపిస్తా. ఓకే అనుకున్న తరువాత అన్నయ్య (బన్నీ) కూడా వింటాడు. సినిమాల్లోకి రాకముందు బర్త్ డే సెలబ్రేషన్స్ ఫ్యామిలీతో కలిసి చేసుకున్న సందర్బాలు చాలా తక్కువ. కాని సినిమాల్లోకి వచ్చిన తరువాత నా ఫ్యామిలీ, మీడియా మిత్రులతో కలిసి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది.
ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాను. అందులో సూర్య హీరోగా కె.వి.ఆనంద్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఒకటి కాగా. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ చేసిన ‘ఏబీసీడీ’ రీమేక్ మరోటి అంటూ తన చిత్ర విశేషాలు చెప్పుకొచ్చారు శిరీష్. కాగా అల్లు శిరీష్ ఇటీవల ‘ఒక్కక్షణం’ సినిమాలో నటించారు. ఈ మూవీ కమర్షియల్‌గా వర్కౌట్ కాకపోయినా.. శిరీష్ నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇక అల్లు అర్జున్ ‘నా పేరు సూర్య’ తరువాత కొత్త ప్రాజెక్ట్‌ను ఇంకా ప్రకటించలేదు. ప్రస్తుతం కథలు వినే పనిలో ఉన్నారు.