యాప్నగరం

‘నా పేరు సూర్య’ ప్రారంభం: సైనికుడిగా బన్నీ!

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ప్రారంభమైంది.

TNN 14 Jun 2017, 11:34 am
స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కొత్త సినిమా ‘నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా’ ప్రారంభమైంది. బుధవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అర్జున్ తల్లి నిర్మల ముహూర్తం క్లాప్ కొట్టారు. ఈ సినిమాతో రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా ఆరంగేట్రం చేస్తున్నారు. రామలక్ష్మీ సినీ క్రియేషన్స్ బ్యానర్‌పై లగడపాటి శ్రీధర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ సంగీత ద్వయం విశాల్, శేఖర్ తొలిసారి బన్నీ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి ‘నా పేరు సూర్య’కు పనిచేస్తున్నారు.
Samayam Telugu allu arjuns new film naa peru surya naa illu india launched
‘నా పేరు సూర్య’ ప్రారంభం: సైనికుడిగా బన్నీ!


వంశీ చెప్పిన స్క్రిప్టు నచ్చడంతో ఈ రచయితను దర్శకుడిగా పరిచయం చేయడానికి బన్నీ సిద్ధపడ్డాడు. ఈ సినిమాలో బన్నీ సైనికుడిగా కనిపించనున్నాడట. యుద్ధ నేపథ్యంలో సాగే సినిమా అని ఫిల్మ్‌నగర్ సమాచారం. యుద్ధ సన్నివేశాలను అత్యద్భుతంగా చిత్రీకరించడానికి చిత్ర యూనిట్ మంచి లొకేషన్ల కోసం అన్వేషిస్తోంది. కన్నడ నటి రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. కాగా, అర్జున్ లేటెస్ట్ ఫిల్మ్ ‘దువ్వాడ జగన్నాథం’ ఈ నెల 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.
My New Film " Na Peru Surya Na Illu India " Muhurtham Today. #AA18 #NaPeruSurya pic.twitter.com/5Y9mPMkcyS — Allu Arjun (@alluarjun) June 14, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.