యాప్నగరం

తనని కలిసిన ఫ్యాన్స్ కోసం బన్నీ ఏం చేశాడో తెలుసా ?

తమ సినిమా షూటింగ్స్ చూడ్డానికి వచ్చే అభిమానులతో వీలైతే ఫోటో దిగడం, ఇంకా వీలైతే ఆటోగ్రాఫ్ ఇవ్వడం సినిమా స్టార్స్‌కి షరా మామూలే...

TNN 6 Oct 2017, 4:10 pm
తమ సినిమా షూటింగ్స్ చూడ్డానికి వచ్చే అభిమానులతో వీలైతే ఫోటో దిగడం, ఇంకా వీలైతే ఆటోగ్రాఫ్ ఇవ్వడం సినిమా స్టార్స్‌కి షరా మామూలే. అఫ్‌కోర్స్ సెట్స్‌లో అభిమానులని తమ దరిదాపుల్లోకి రానివ్వని స్టార్స్ కూడా వున్నారు అది వేరే విషయంలెండి. కానీ మన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం అలా కాదు.. సెట్స్ లో తనని కలవడానికి వచ్చిన అభిమానులతో కాసేపు ముచ్చటించడమే కాకుండా ఏకంగా వారికి భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాడట.
Samayam Telugu allu arjuns touching gesture for his fans in ooty
తనని కలిసిన ఫ్యాన్స్ కోసం బన్నీ ఏం చేశాడో తెలుసా ?


బన్నీ హీరోగా తెరకెక్కుతున్న నా పేరు సూర్య సినిమా షూటింగ్ ప్రస్తుతం ఊటీలో జరుగుతోంది. ప్రముఖ రచయిత వక్కంతం వంశీ దర్శకుడిగా మారి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బన్నీ సరసన అనుఇమ్మాన్యుయెల్ జంటగా నటిస్తోంది. ఊటీలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్ చూడటానికి తెలుగు వారితోపాటు కేరళ, తమిళనాడులో వున్న బన్నీ ఫ్యాన్స్ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారట. దూర ప్రాంతాల నుంచి వస్తున్న అభిమానులు కావడంతో వారిని షూటింగ్ చూడటానికి అనుమతించడంతోపాటు వారికి భోజనం కూడా ఏర్పాటు చేయిస్తున్నాడట బన్నీ. అదండీ సంగతి!!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.