యాప్నగరం

​రొమాన్స్ చాలు.. పెళ్లెందుకు? అంటున్న మెగా హీరో!

ట్విటర్ ఫాలోయర్ కు సర్ ప్రైజ్ సమాధానాన్ని ఇచ్చాడు అల్లు శిరీష్.

TNN 20 Jun 2017, 6:04 pm
తనకు పెళ్లి చేసుకొమ్మని సలహా ఇచ్చిన ట్విటర్ ఫాలోయర్ కు సర్ ప్రైజ్ సమాధానాన్ని ఇచ్చాడు అల్లు శిరీష్. రొమాంటిక్ ట్వీట్లను పెట్టేస్తున్న శిరీష్ తీరును చూసి ఒక అభిమాని.. ‘భయ్యా నీకు ప్రతీదీ అందంగా కనిపిస్తోంది, ఆఖరి బురద కూడా.. త్వరగా పెళ్లి చేసుకో..’ అని సరదా సలహాను శిరీష్ కు ట్వీట్ చేశాడు. దీనిపై అల్లు శిరీష్ ఆసక్తికరమైన రీతిలో స్పందించాడు.
Samayam Telugu allu shirish tweets
​రొమాన్స్ చాలు.. పెళ్లెందుకు? అంటున్న మెగా హీరో!


‘పెళ్లి ఎందుకు సార్.. ఇప్పటికే వర్షం, ట్రాఫిక్ తో సతమతమవుతున్నా, రొమాన్స్ కు పెళ్లి అవసరం లేదు.. రిలేషన్ షిప్ చాలు..’ అంటూ శిరీష్ ట్వీట్ చేశాడు. అలాగే తనకు హోంమేకర్ గా ఉండటానికి కూడా అభ్యంతరం లేదని శిరీష్ మరో అభిమాని ప్రశ్నకు సమాధానం ఇచ్చాడు.

‘మీరు గత జన్మలో హోం మేకర్ అయి ఉంటారు..’ అని ఒక ఫాలోయర్ ట్వీట్ చేయగా, ‘ఈ జన్మలో కూడా అలా ఉండటానికి నాకు అభ్యంతరం లేదు..’ అన్నాడు ఈ మెగా హీరో. ఎంచక్కా గర్ల్ ఫ్రెండ్ సంపాదించుకుని వస్తుంటే, ఆమెకు వండి పెడుతూ గడిపేయడంలో ఆనందం ఉంటుందని ట్వీట్ చేశాడు. ఈ విధంగా ఫాలోయర్లతో సరదాగా సాగింది శిరీష్ సంభాషణ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.