యాప్నగరం

Allu Sneha Reddy : అల్లు అర్జున్ స‌తీమ‌ణి లేటెస్ట్ ఫొటో.. క‌ళ్యాణ్ దేవ్ కామెంట్ చూస్తే..

సోషల్ మీడియా వచ్చిన తర్వాత సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు సినీ తార‌లు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యార‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే వారి సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్‌ను ఇవ్వ‌టంతో పాటు వారి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన వివ‌రాల‌ను కూడా వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ఫొటోలైనా కావ‌చ్చు.. వీడియోలైనా కావ‌చ్చు. ఇలా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక‌టి. అల్లు అర్జున్‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహ ఈమ‌ధ్య‌..

Authored byతుమ్మల మోహన్ | Samayam Telugu 16 Aug 2022, 10:19 am
Samayam Telugu Allu Sneha Reddy
అల్లు స్నేహా రెడ్డి
సోషల్ మీడియా వచ్చిన తర్వాత సాధార‌ణ ప్రేక్ష‌కుల‌కు సినీ తార‌లు మ‌రింత ద‌గ్గ‌ర‌య్యార‌న‌డంలో సందేహం లేదు. ఎందుకంటే వారి సినిమాల‌కు సంబంధించిన అప్డేట్స్‌ను ఇవ్వ‌టంతో పాటు వారి వ్య‌క్తిగ‌త జీవితానికి సంబంధించిన వివ‌రాల‌ను కూడా వారు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అవి ఫొటోలైనా కావ‌చ్చు.. వీడియోలైనా కావ‌చ్చు. ఇలా సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే వారిలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక‌టి. అల్లు అర్జున్‌ (Allu Arjun)తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి స్నేహ (Sneh areddy) ఈ మ‌ధ్య‌లో ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా మారారు.

స్నేహా రెడ్డి (Allu Sneha Reddy) ఫ్యామిలీ పిక్స్‌తో పాటు త‌న ప‌ర్స‌న‌ల్ ఫొటోల‌ను కూడా పోస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఆమె గ్లామ‌ర‌స్ ఫొటోల‌ను పోస్ట్ చేస్తుండ‌టం హాట్ టాపిక్‌గా మారింద‌న‌డంలో సందేహం లేదు. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫొటో ఒక‌టి నెట్టింట వైర‌ల్ అవుతుంది. ఇక్కడ పేర్కొనాల్సిన విష‌య‌మేమంటే.. అల్లు స్నేహా రెడ్డి పోస్ట్ చేసిన ఫొటోపై చిరంజీవి రెండ‌వ అల్లుడు క‌ళ్యాణ్ దేవ్ (Kalyaan Dhev) కామెంట్ చేశాడు. ఫైర్ ఎమోజీతో పాటు స్నేహా అంటూ కామెంట్ షేర్ చేశాడు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విష‌యానికి వ‌స్తే.. పుష్ప ది రైజ్ సినిమా స‌క్సెస్‌తో పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు పుష్ప ది రూల్ సినిమా కోసం రెడీ అవుతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఫ్యాన్స్‌, ప్రేక్ష‌కులు ఈ సినిమా కోసం చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy)
రచయిత గురించి
తుమ్మల మోహన్
మోహ‌న్ కుమార్ తుమ్మ‌ల స‌మ‌యం తెలుగులో డిజిట‌ల్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌ని చేస్తున్నారు. ఇక్కడ సినిమాల‌కు సంబంధించిన అప్‌డేట్స్, వార్తలను రాస్తుంటారు. మోహ‌న్ కుమార్‌కి సినీ జ‌ర్న‌లిజంలో 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. గ‌తంలో ప్ర‌ముఖ మీడియా సంస్థ‌ల్లో సినీ జ‌ర్న‌లిస్టుగా వ‌ర్క్ చేశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.