యాప్నగరం

దానికి బానిసనయ్యానన్న కాజల్ అగర్వాల్!

ఇటీవలే 50 సినిమాను చేసిన ఈమె.. సెంచరీనే లక్ష్యమంటోంది..

TNN 5 Sep 2017, 8:20 am
ఇప్పటికే హాఫ్ సెంచరీని పూర్తి చేసింది కాజల్ అగర్వాల్. ఇటీవల విడుదల అయిన ‘నేనే రాజు నేనే మంత్రి’ ఈమె కెరీర్ లో 50వ సినిమా. ఈ సినిమా హిట్ అయ్యింది కూడా. మరి ఈ రోజుల్లో హీరోయిన్లు ఈ మాత్రం లెంగ్తీ కెరీర్ ను కలిగి ఉండటం కూడా గొప్ప సంగతే. భారీ అంచనాలతో వచ్చిన హీరోయిన్లు ఒకటీ రెండు సినిమాల్లో మెరిసి అంతర్థానం అవుతున్న పరిస్థితి. ఇలాంటి చిత్రసీమలో కాజల్ ఇప్పటికే దశాబ్దం పై నుంచి హీరోయిన్ గా రాణిస్తోంది.
Samayam Telugu am addicted to work said kajal
దానికి బానిసనయ్యానన్న కాజల్ అగర్వాల్!


తెలుగుతో పాటు తమిళ, అడపాదడపా హిందీ సినిమాల్లో కూడా నటిస్తూ కాజల్ ఈ హాఫ్ సెంచరీ ఫీట్ ను సాధించింది. మరి ఈ నేపథ్యంలో ఈ భామ మాట్లాడుతూ..యాభై సినిమాలు కాదు, ఇంకో యాభై సినిమాలు చేయాలని ఉంది.. అని అంటోంది. అంత ఎనర్జీ తనలో స్టాక్ ఉందని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. తనకు పని ప్రాణం అని, పనే వ్యసనం అని చెప్పింది. పని చేయడానికి తను బానిసనయ్యాను అని కాజల్ వివరించింది.

ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ.. మంచి వ్యక్తి దొరికితే వివాహం చేసుకుంటానని చెప్పింది. తనకు పార్టీలకు, పబ్బులకు వెళ్లే అలవాటు లేదని.. అందుకే తన విషయంలో స్నేహాలు, ఎఫైర్లు అంటూ వార్తలు రావని అభిప్రాయపడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.