యాప్నగరం

25 ఏళ్ల తర్వాత మళయాళం సినిమాలో అమల

1992లో నాగార్జునని పెళ్లి చేసుకోవడానికి ముందు అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించిన అమల అక్కినేనికి..

TNN 21 Aug 2016, 2:00 pm
1992లో నాగార్జునని పెళ్లి చేసుకోవడానికి ముందు అన్ని భాషల్లో కలిపి దాదాపు 50 సినిమాల్లో నటించిన అమల అక్కినేనికి మళయాళంలోనూ మంచి గుర్తింపుంది. మళయాళంలో ఎప్పటికీ గుర్తుండిపోయే అతి కొద్ది సినిమాల జాబితాలో అమల నటించిన ఎంటె సూర్యపుత్రిక్కు, ఉల్లడక్కం వంటి చిత్రాలు కూడా ఉన్నాయి. అయితే, నాగ్‌ని పెళ్లి చేసుకుని సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత అమల మళ్లీ మళయాళం సినిమాల వైపు కన్నెత్తి చూడలేదు. అలా 25 ఏళ్లు గడిచిపోయిన తర్వాత తాజాగా ఆంటోని సోని అనే ఓ కొత్త డైరెక్టర్ తెరకెక్కిస్తున్న 'C/o సైరభాను' చిత్రానికి సైన్ చేసిందామె.
Samayam Telugu amala akkineni to get back in to malayalam industry after 25 years
25 ఏళ్ల తర్వాత మళయాళం సినిమాలో అమల


మంజు వారియర్ ఫీమేల్ లీడ్ రోల్ చేస్తున్న ఈ సినిమాలో అమల ఓ లాయర్ పాత్ర పోషిస్తోంది. " హీరోయిన్‌కి సమానమైన స్థాయి, ప్రాధాన్యతలు కలిగిన ఈ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటే బాగుంటుందా అని ఆలోచిస్తున్న తరుణంలో తమకి తట్టిన పేరు అమల. ఇప్పటికీ అమలకి ఇక్కడ మంచి గుర్తింపు, ఇమేజ్ వున్నాయి. అందుకే అమలని తీసుకున్నాం" అని చెబుతున్నారు ఆ చిత్ర డైరెక్టర్. కొచ్చిలో తెరకెక్కనున్న ఈ చిత్రం సెప్టెంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది. అన్నట్టు పెళ్లయిన తర్వాత తెలుగులోనూ అమల చేసిన ఓ సినిమా గుర్తింది కదూ.. అదేనండి.. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో 2012లో వచ్చిన 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.