యాప్నగరం

అమితాబ్ తన భార్యతో విడిపోయారా?

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంపై ఎప్పుడు ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది.

TNN 24 Jan 2017, 8:32 pm
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ కుటుంబంపై ఎప్పుడు ఏదొక వార్త వినిపిస్తూనే ఉంటుంది. మొన్నామధ్య ఐశ్వర్య, రణబీర్‌తో కలిసి ఓ సినిమాలో రొమాన్స్ చేసినందుకు బచ్చన్ ఫ్యామిలీలో మనస్పర్ధలు వచ్చాయని.. అభిషేక్‌కు ఐశ్వర్యకు అసలు పడట్లేదని మాట్లాడుకున్నారు. కానీ రీసెంట్‌గా బాలీవుడ్‌లో జరిగిన స్టార్ డస్ట్ అవార్డ్స్‌కు ఈ జంట హాజరయ్యి ఎంతో అన్యోన్యంగా మెలగడంతో వారి మధ్య ఎలాంటి విబేధాలు లేవని తేలాయి.
Samayam Telugu amitabh and jaya bachchan were living separately amar singh claims in a shocking statement
అమితాబ్ తన భార్యతో విడిపోయారా?


ఆ విషయం మర్చిపోతున్నారనుకుంటున్న సమయంలో మరో వార్త వెలుగులోకి వచ్చింది. ఈసారి ఏకంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, అతడి భార్య జయా బచ్చన్‌లు విడివిడిగా బ్రతుకుతున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ మాటలు అన్నది వేరెవరో అయితే లైట్ తీసుకోవచ్చు కానీ బచ్చన్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన అమర్ సింగ్ ఈ వ్యాఖ్యలు చేయడంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్‌గా మారింది.

అమితాబ్, జయా విడివిడిగా ఉంటున్నారు. ఒకరు ప్రతీక్షలో.. మరొకరు జానక్‌లో నివాసముంటున్నారని వెల్లడించారని అమర్ సింగ్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి వీటిపై అమితాబ్ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో.. చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.