యాప్నగరం

ట్విట్టర్‌కు అమితాబ్ వార్నింగ్

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించే అమితాబ్‌‌కు ఫాలోవర్లను కోల్పోవడంతో బాధించింది.

TNN 1 Feb 2018, 12:02 pm
ప్రముఖ సామాజిక మాధ్యమం 'ట్విటర్' తన పద్ధతులు మార్చుకోకపోతే తన ట్విట్టర్ ఖాతాను మూసేసుకుంటానని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబచ్చన్ హెచ్చరించారు. ఒక్కసారిగా 60 వేల మంది ఫాలోవర్లను కోల్పోవడంతో ఆగ్రహించిన అమితాబ్ ఈ మేరకు 'ట్విట్టర్'కు హెచ్చరికలు జారీ చేశారు. 3,29,41,837 మంది ఫాలోవర్లతో షారుక్ ఖాన్ ట్విట్టర్‌‌లో మొదటి స్థానంలో ఉండగా అమితా బచ్చన్ ఆతర్వాతి వరుసలో ఉన్నారు. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిపరమైన వివరాలను ఎప్పటికప్పుడు వెల్లడించే అమితాబ్‌‌కు ఫాలోవర్లను కోల్పోవడంతో బాధించింది.
Samayam Telugu amitabh bachchan accuses twitter of reducing his number of followers threatens to quit
ట్విట్టర్‌కు అమితాబ్ వార్నింగ్


అయితే ఈ సమస్య ఒక్క అమితాబ్ బచ్చన్‌‌కు సంబంధించింది మాత్రమే కాదని ఐటీ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పలువురు సెలెబ్రిటీలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారని చెబుతున్నారు. సోషల్ మీడియాలో నకిలీ అకౌంట్లు నిర్వహించే వారిని అమెరికాన్ నిఘా సంస్థలు గుర్తించి తొలగిస్తున్న విషయాన్ని అమితాబ్ గుర్తించాలని సూచిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.