ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన యోధుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి పేరుంది. ఉద్యమకాలం నాటి నుంచి నేటివరకు తెలంగాణలో కొన్నివర్గాల్లో ఆయనకి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వుంది. తెలంగాణలో ఆయనకున్న ఈ ఇమేజ్‌నే దృష్టిలో పెట్టుకుని విశ్వన్ అనే ఓ ఫిలింమేకర్ కేసీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఓ బయోపిక్‌ని తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇండియాగ్లిట్జ్ ప్రచురించిన ఓ కథనం ప్రకారం కేసీఆర్ పాత్ర చేయడానికి అమితాబ్ బచ్చన్‌ని ఒప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఓ ఇంగ్లీష్ డైలీ పేర్కొన్నట్టుగా ఇండియాగ్లిట్జ్ కథనం పేర్కొంది. అయితే, అంతకన్నా ముందుగా ఈ సినిమాని సెట్స్‌పైకి తీసుకువెళ్లడానికి డైరెక్టర్ విశ్వన్.. సీఎం కేసీఆర్ అనుమతి తీసుకోవాల్సి వుంది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనా చారి సన్నిహితమిత్రుడైన ఎర్రోజు వెంకటా చారి ఈ సినిమాని నిర్మించేందుకు ముందుకు వచ్చినట్టుగా ఈ కథనం తెలిపింది. కేసీఆర్ బాల్యం, రాజకీయ రంగ ప్రవేశం, ఉద్యమ చరిత్ర, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం చేపట్టిన నిరాహారదీక్ష వంటి అంశాలు ఈ సినిమాలో ప్రముఖంగా ప్రస్తావించనున్నారు. ఒకవేళ బిగ్ బీ కానీ ఈ సినిమాకి సైన్ చేసినట్టే అయితే, అది భారీ బడ్జెట్ మూవీ అయ్యే అవకాశం వుందని తెలుస్తోంది. గతంలో కూడా కేసీఆర్ బయోపిక్‌కి సంబంధించిన వార్తలొచ్చినప్పటికీ... వాటిని ఎవ్వరూ ధృవీకరించలేదు. ఇప్పుడు కూడా ఈ వార్తలపై ఎవ్వరూ స్పందించకపోవడం గమనార్హం.
సీఎం కేసీఆర్ బయోపిక్‌లో అమితాబ్ బచ్చన్ ?
ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సాధించిన యోధుడిగా తెలంగాణ సీఎం కేసీఆర్‌కి పేరుంది.
Samayam Telugu 4 Jun 2016, 1:18 pm