యాప్నగరం

ఆమె జయ, శోభన్‌బాబుల కూతురే!

జయలలిత కూతురుని అంటూ కోర్టుకు ఎక్కి చీవాట్లు తిన్న

TNN 2 Dec 2017, 7:19 am
జయలలిత కూతురుని అంటూ కోర్టుకు ఎక్కి చీవాట్లు తిన్న అమృతకు అనూహ్య మద్దతు దక్కింది. అర్థం లేని పిటిషన్ అంటూ కోర్టు అమృతపై ఆగ్రహం వ్యక్తం చేసినా.. ఆమె జయలలిత కూతురే అనే మాట వినిపిస్తోందిప్పుడు. జయలలిత స్నేహితురాలిగా గుర్తింపు ఉన్న గీత ఒక టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన వ్యాఖ్యలే చేశారు.
Samayam Telugu amrutha is daughter of jayalalitha
ఆమె జయ, శోభన్‌బాబుల కూతురే!


జయలలితకు ఒక కూతురు ఉంది.. అంటున్నారు గీత. అలనాటి తెలుగు స్టార్ హీరో శోభన్ బాబుతో జయలలితకు సంతానం కలిగిందని ఆమె వ్యాఖ్యానించారు. వాళ్లకు ఒక పాప పుట్టిందని, తన పేరు అమృత అని గీత వ్యాఖ్యానించారు. ఈ విషయాన్ని జయలలిత తనకు స్వయంగా చెప్పిందని ఆమె చెప్పుకొచ్చారు. కూతురు అమృతతో జయలలితకు సత్సంబంధాలే ఉండేవని.. అన్నారు.

ఈ విషయం గురించి శోభన్ బాబు కూడా తనతో చర్చించాడని గీత చెప్పుకురావడం విశేషం. తనకు జయతో కూతురు ఉన్నట్టుగా శోభన్ బాబు చెప్పాడని 1999లోనే తనకు ఈ విషయం తెలుసని గీత అన్నారు. జయ, శోభన్ ల కూతురిని అని కోర్టుకు ఎక్కి, మీడియాకు చెబుతున్న అమృతకు డీఎన్ఏ టెస్టులు చేస్తే విషయం స్పష్టం అవుతుందని గీత అభిప్రాయపడ్డారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.