యాప్నగరం

Ram Charan: ఆనంద్ మహీంద్రాకి నాగార్జునను పరిచయం చేసిన రామ్ చరణ్.. ఏంటి స్వామీ ఇదీ..!!

హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా-ఈ (Hyderabad E-Prix) రేస్‌‌ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సహా పలువురు సెలబ్రిటీలు వీక్షించారు. అయితే, మహీంద్రా గ్రూప్ శిబిరంలో రామ్ చరణ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సందడి చేశారు.

Authored byవరప్రసాద్ మాకిరెడ్డి | Samayam Telugu 11 Feb 2023, 8:47 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్ ఈ-ప్రి రేస్‌లో సందడి చేసిన రామ్ చరణ్
  • ఆనంద్ మహీంద్రాకు నాటునాటు స్టెప్స్ నేర్చించిన హీరో
  • కింగ్ నాగార్జునను పరిచయం చేయడంతో ఆశ్చర్యపోయిన మహీంద్రా బాస్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ram Charan and Anand Mahindra
ఆనంద్ మహీంద్రాతో రామ్ చరణ్ నాటు నాటు స్టెప్
మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాకు (Anand Mahindra) మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నాటు నాటు స్టెప్స్ నేర్పించారు. వెండితెరపై ఎన్టీఆర్ కలిసి స్టెప్పులేసిన రామ్ చరణ్.. ఫార్ములా ఈ-రేస్ జరుగుతున్న చోట ఆనంద్ మహీంద్రా భుజంపై చేయివేసి ఆయనతో నాటు నాటు స్టెప్స్ వేయించారు. ఈ మేరకు ఆనంద్ మహీంద్రా ఒక వీడియో‌ను ట్వీట్ చేశారు.
‘రేసు విషయం పక్కన పెడితే, హైదరాబాద్ ఈ-ప్రీ‌లో నాకు ఒక రియల్ బోనస్ దక్కింది. రామ్ చరణ్ దగ్గర నుంచి బేసిక్ నాటు నాటు స్టెప్స్ నేర్చుకున్నాను. నీకు కృతజ్ఞతలు. ఆస్కార్స్ గెలుచుకోవాలని కోరుకుంటున్నాను మై ఫ్రెండ్’ అని ఆనంద్ మహీంద్ర ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఆనంద్ మహీంద్రాకు చరణ్ నాటు నాటు స్టెప్స్ నేర్పించడం కూడా చాలా క్యూట్‌గా ఉంది. ఈ స్టెప్స్ వేసిన తరవాత ఆనంద్ మహీంద్రా ఎంతో ఆప్యాయంగా చరణ్‌ను ఆలింగనం చేసుకున్నారు. అయితే, ఆ వెనుకే హీరో నాగార్జున రావడంతో ఆయన్ని ఆనంద్ మహీంద్రాకు చరణ్ పరిచయం చేశారు. ‘హీ ఈజ్ మిస్టర్ నాగార్జున’ అని చరణ్ పరిచయం చేయగానే.. నాకు తెలియకపోవడం ఏంటి స్వామీ అన్నట్టుగా చరణ్ వంక ఆనంద్ మహీంద్రా చూశారు.

ఇదిలా ఉంటే, ఈరోజు జరిగిన హైదరాబాద్ ఈ-ప్రీ ఫార్ములా-ఈ రేసులో రామ్ చరణ్‌తో పాటు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్, కింగ్ నాగార్జున, నాగ చైతన్య, రాకింగ్ స్టార్ యశ్, మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్, అఖిల్ అక్కినేని, సిద్ధు జొన్నలగడ్డ, మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అయితే.. రామ్ చరణ్, సచిన్ టెండూల్కర్ మహీంద్రా గ్రూప్ శిబిరంలో సందడి చేశారు. అలాగే, స్పోర్ట్స్ కారులో సచిన్ టెండూల్కర్, రామ్ చరణ్ ట్రాక్‌పై చక్కర్లు కొట్టారు. వీళ్లిద్దరికీ ఒక స్పోర్ట్స్ కారులో ఫార్ములా రేసింగ్ ట్రాక్‌పై చక్కర్లు కొట్టడం ఇదే తొలిసారట.

కాగా, హైదరాబాద్ ఈ ప్రీ 2023 విజేతగా డీఎస్ పెన్‌స్కీ డ్రైవర్ జీన్ ఎరిక్ వెర్జనీ నిలిచారు. ఆయనకి తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు ట్రోఫీని అందజేశారు. ఇక రెండో స్థానంలో ఎన్విజన్ రేసింగ్ డ్రైవర్ నిక్ క్యాసిడీ నిలిచారు. మూడో స్థానాన్ని ఎన్విజన్ రేసింగ్ మరో డ్రైవర్ సెబాస్టియన్ బ్యూమీ కైవసం చేసుకున్నారు. మహీంద్రా రేసింగ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. మహీంద్రా రేసింగ్ డ్రైవర్ ఒలివర్ రోలాండ్ విజేత జీన్ ఎరిక్ వెర్జనీ కంటే 7.138 సెకన్ల ఆలస్యంగా గమ్యాన్ని చేరుకున్నాడు.
రచయిత గురించి
వరప్రసాద్ మాకిరెడ్డి
వరప్రసాద్ మాకిరెడ్డి సమయం తెలుగులో ప్రిన్సిపల్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ సినిమా రంగానికి సంబంధించిన తాజా వార్తలు, స్టోరీలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 12 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో టెక్నాలజీ, క్రీడలు, సినిమా రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.