యాప్నగరం

అయ్యో అనసూయ.. అందుకే పవన్ పక్కన చేయలేదా..?

త్రివిక్రమ్ చీర కట్టుకుని చేయమన్నారు.. కానీ నేనే వద్దని ఆఫర్‌ని వదిలేశా

TNN 19 Feb 2017, 2:55 pm
పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన అత్తారింటికి దారేది సినిమాలోని ఐటెం సాంగ్‌లో నటించేందుకు చిత్ర యూనిట్ అప్పట్లో యాంకర్ అనసూయను సంప్రదించగా.. ఆమె తిరస్కరించింది. త్రివిక్రమ్ డైరెక్షన్‌లో అదీ పవన్ పక్కన నటించే ఛాన్స్‌ను అనసూయ వదులుకోవడమేంటి..? అంటూ అప్పట్లో అందరూ చెవులు కొరుక్కున్నారు. అయితే ఈ మెగా ఆఫర్‌ను వదులుకోవడానికి బలమైన కారణం ఉందని తాజాగా బయటపెట్టింది ఈ హాట్ యాంకర్ .
Samayam Telugu anasuya about pawans attarintiki daredi
అయ్యో అనసూయ.. అందుకే పవన్ పక్కన చేయలేదా..?


‘ఆ ఆఫర్ వచ్చినప్పుడు నేను ఐదు నెలల గర్భవతిని. దీంతో ఐటెం సాంగ్‌లో డ్యాన్స్ చేయలేనని చెప్పా. అయితే త్రివిక్రమ్ మాత్రం చీర కట్టుకుని డ్యాన్స్ చేయమని సూచించారు. కానీ నేను అంత సాహసం చేయలేనని తిరస్కరించా’ అంటూ అనసూయ చెప్పుకొచ్చింది. తాజాగా సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘విన్నర్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసిన ఈ భామ ప్రస్తుతం ఆ సినిమాను సోషల్ మీడియాలో తెగ ప్రమోట్ చేస్తోంది. విన్నర్ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.