యాప్నగరం

నా అజ్ఞానాన్ని క్షమించండి.. నా బాధను అర్థం చేసుకోండి: అనసూయ

టీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్నకు అనసూయ క్షమాపణలు చెప్పారు. ఆయన్ని తెలంగాణ అటవీశాఖ మంత్రి అనుకొని ఆమె యురేనియం ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. మొత్తానికి అసలు విషయం తెలుసుకున్నారు.

Samayam Telugu 13 Sep 2019, 6:53 am
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అతిపెద్ద అటవీ ప్రాంతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలను చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అభ్యంతరం చెప్పకపోవడంతో ఇది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Samayam Telugu Anasuya


ఇప్పటికే ప్రతిపక్ష నాయకులతోపాటు పర్యావరణవేత్తలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లమల అడవుల్లో యురేనియంను వెలికి తీసి దాంతో అణువిద్యుత్‌ను తయారుచేయడానికి ఈ తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వాలు చూస్తున్నాయి. నల్లమల ప్రాంత జనజీవనం మీద, మొత్తంగా తెలంగాణ, ఏపీ రాష్ట్రాలలో అనేక ప్రాంతాల ప్రజల మీద, పర్యావరణం మీద, ఆర్థిక, సామాజిక వ్యవస్థల మీద పెను ప్రభావం చూపే యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని అంతా వ్యతిరేకిస్తున్నారు.

Also Read: ‘సైరా’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌లుగా పవన్, రాజమౌళి

ఇలా వ్యతిరేకించే వారిలో సినీనటులు కూడా చేరారు. ఇప్పటికే విజయ్ దేవరకొండ యురేనియం తవ్వకాలను వ్యతిరేకిస్తూ ట్వీట్ చేశారు. తాజాగా అనసూయ కూడా ఈ చర్యను వ్యతిరేకించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు.

‘‘ఇప్పుడే సెల్ఫ్ ఎడ్యుకేట్ చేసుకున్నా.. యురేనియం ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయడానికి కావాలంట. సో, నేచురల్‌గా పీల్చే స్వచ్ఛమైన గాలిని ప్రసాదించే చెట్లను చంపి.. ఎలక్ట్రిక్ పరికరాల ద్వారా రానున్న రోజుల్లో కొనుక్కునే వాళ్లకే పీల్చడానికి గాలి లేకపోతే ఊపిరి ఆడక చావు.. అంతేగా??. ఇదేగా మన భవిష్యత్తు?? ఎలా అనుమతిస్తున్నారు సార్ ఇదంతా?? ఆలోచించడానికే భయం వేయలేదా?’’ అంటూ ఘాటుగానే అనసూయ ట్వీట్ చేశారు.
అయితే, ఇక్కడే అనసూయ ఒక తప్పు చేశారు. దయచేసి ఈ యురేనియం తవ్వకాలను జరపొందంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్న, ఏపీ అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్‌‌లను ట్వీట్‌లో అనసూయ ట్యాగ్ చేశారు. అయితే, జోగు రామన్న తెలంగాణ అటవీ శాఖ మంత్రి అనుకొని అనసూయ ఆయన్ని ట్వీట్‌లో ట్యాగ్ చేశారు. కానీ, ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యే మాత్రమే.
టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరవాత జోగు రామన్నకు మంత్రి వర్గంలో చోటు దక్కింది. పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అయితే, ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో జోగు రామన్నకు స్థానం దక్కలేదు. ఆయన స్థానంలో ఇంద్రకరణ్ రెడ్డి పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న అనసూయ.. జోగు రామన్నకు క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు. కరెంట్ అఫైర్స్‌పై తనకున్న అజ్ఞానాన్ని మన్నించి సమస్యపై తన ఇంటెన్షన్‌ను పరిగణనలోకి తీసుకోవాలని ఇంద్రకరణ్ రెడ్డిని కోరారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.