యాప్నగరం

ఐటెం సాంగ్‌కి అన‌సూయ అంత తీసుకుందా..?

హాట్ యాంకర్‌కి అదిరిపోయే రెమ్యునరేషన్ ఇచ్చిన విన్నర్ టీమ్

TNN 12 Feb 2017, 1:03 pm
బుల్లి తెరపై హాట్ యాంకర్‌గా తనదైన ముద్రవేసిన అనసూయ.. సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న విన్నర్ సినిమాలో ఐటెం సాంగ్ చేసి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వెండితెరపై ఇప్పటి వరకు చిన్న పాత్రలతో మెరిసిన ఈ యాంకర్ పూర్తి స్థాయిలో ఓ పాటలో కనిపించడం ఇదే తొలిసారి. అయితే ఐటెం సాంగ్ చేయడానికి అనసూయ తొలుత నిరాకరించినా.. పాట తన పేరుతోనే సుయ..సుయ.. అనసూయ అంటూ మొదలవడం, ఈ పాటను ప్రత్యేకంగా మరో యాంకర్ సుమ పాటడంతో చివరకు ఒప్పకుందని తెలుస్తోంది.
Samayam Telugu anasuya winner remuneration rs 10 lakh
ఐటెం సాంగ్‌కి అన‌సూయ అంత తీసుకుందా..?


అంతేకాదు ఈ పాట కోసం ఏకంగా రెమ్యునరేషన్ రూపంలో రూ.10 లక్షల వరకు తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ సమాచారం. గోపిచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), ఠాగూర్ మధు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తుండగా.. తాజాగా విడులైన థియేట్రికల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.